Regulate unauthorized layouts.
అనధికార లేఔట్లు క్రమబద్దీకరించుకోండి .
- కమిషనర్ అనుపమ అంజలి.
సాక్షిత : నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అనధికార లేఔట్లను వెంటనే క్రమబద్దీకరించుకోవాలని కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.
లేఔట్ల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న వారి లేఔట్లను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి శనివారం కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని కొన్ని లేఔట్లను ఇంకా క్రమబద్దీకరించుకోలేదన్నారు. వాటిని వెంటనే గుర్తించమని ప్లానింగ్ అధికారులను ఆదేశించామన్నారు.- భవిష్యత్తు లో కూడా నిర్మాణాలు చేసుకోవాలన్న ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వెంటనే క్రమబద్దీకరణ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం తమకు దరఖాస్తు చేసుకున్న తిమ్మినాయుడు పాళెం, కొత్తపల్లి జనచైతన్య లేఔట్, కొంకచెన్నాయగుంట లేఔట్లను పరిశీలించామన్నారు.
కమిషనర్ వెంట అదనపు కమిషనర్ సునీత, సిటీ ప్లానర్ బాల సుబ్రహ్మణ్యం, టి పి బి ఓ ధర్మరాజు, ప్లానింగ్ సెక్రటరీ లు తదితరులు ఉన్నారు