
అన్నదాతల ఆర్తనాదాలు పట్టవా!” -కాకాణి
SPS నెల్లూరు జిల్లా:
ముత్తుకూరు మండలం పోతునాయుడుదిబ్బ, డమ్మాయిపాళెం గ్రామాలలో పర్యటించి, రైతులతో కలిసి ధాన్యం అమ్మకాలను పరిశీలించిన మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి .
ధాన్యానికి గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్నామంటూ, తమ గోడు వెల్లబోసుకున్న రైతులు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ, ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప, ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టే నాధుడే కరువయ్యాడంటున్న రైతులు.
ధాన్యం ధరలు రోజురోజుకీ దిగజారడంతో, తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని రైతుల ఆందోళన.
గత సంవత్సరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పుట్టి (850 కేజీల) ధాన్యం 24 వేలకు అమ్మితే, నాడు 15 వేలకు అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడిందంటూ, ఆందోళన వెల్లబుచ్చిన రైతులు.
కూటమి ప్రభుత్వంలో రైతుల అష్ట కష్టాలు పడుతున్నారని ఎరువులు అందక నానా ఇబ్బందులు పడి, అధిక ధరలకు ఎరువులు కొని, నేడు పండిన పంటలు కొనక, తీవ్రంగా నష్టపోయామంటూ, తమ కష్టాలు ఏకరువు పెట్టిన రైతులు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి, గిట్టుబాటు ధర కల్పించి, తమని ఆదుకోకపోతే, ఆత్మహత్యలే శరణ్యమంటూ వాపోయిన కౌలు రైతులు.
చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు అందిస్తామని ఓట్లు వేయించుకొని తమని మోసం చేశాడంటూ, మండిపడ్డ మహిళా వ్యవసాయ కూలీలు.
కూటమి ప్రభుత్వంలో అన్నదాతలు అష్ట కష్టాలు పడవలసిన దుస్థితి.
అన్నదాతలను ఆదుకోవాలని ఏమాత్రం ఆలోచన లేని ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం.
గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 24 వేల లెక్కన అమ్ముకుంటే, నేడు 15 వేలకు అమ్ముకొని రైతులు ఎకరాకు 40వేలకు నష్టపోతున్నారు.
ఇప్పటికే 10 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి.
కోతలు ముమ్మరమైతే, రేట్లు మరింత దిగజారే ప్రమాదం ఉంది.
అధికారులు కాకి లెక్కలు చెప్పకుండా, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను గమనించి, ఆదుకోవాలి.
మిల్లర్లు పుట్టి (850 కేజీల) ధాన్యానికి రేటు ఇస్తూ, అదనంగా 150 కేజీలు తరుగు పేరిట కొలుచుకోవడం దుర్మార్గం.
మిల్లర్లు, దళారులు రైతులను దోచుకుంటుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు.
సోమిరెడ్డి ఏమాత్రం సిగ్గు లేకుండా, బిపిటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదంటూ, అసెంబ్లీలో ప్రకటన చేసి సరిపెట్టుకోవాలని చూస్తున్నాడు.
అధికార పార్టీ శాసనసభ్యునిగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ఆదుకోవల్సింది పోయి, అసెంబ్లీలో మాట్లాడి సర్దుకుపోవాలనుకోవడం అన్యాయం.
సోమిరెడ్డి కోట్లాది రూపాయలు కమిషన్లు కొల్లగొడుతూ, నోట్లు కౌంటింగ్ చేసుకోవడానికి సమయం చాలకపోవడం వల్ల, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టలేకపోతున్నాడు.
సోమిరెడ్డి ఇసుక, గ్రావెల్, బూడిద, మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతూ, వాటి తాలూకు అకౌంట్లు చూసుకోవడంలో బిజీ బిజీగా ఉంటున్నాడు.
సోమిరెడ్డి రైతుల సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోకుండా, ఎక్కడ లేఅవుట్లు వేస్తున్నారా! ఎన్ని ఎకరాలు వేస్తున్నారు! ఎకరాకు ఎన్ని లక్షలు రాబట్టాలనే ఆలోచనతో నిరంతరం తీరిక లేకుండా గడుపుతున్నాడు.
సోమిరెడ్డి సంపాదించిన ఆస్తులతో కుటుంబసభ్యులకు విల్లాలు కొనిపెడుతూ, దోచుకోవడం, దానిని ఎలా దాచుకోవాలనే దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాడు.
అవినీతికి అలవాటు పడిన సోమిరెడ్డి రైతులను పట్టించుకోకుండా, గాలికి వదిలేశాడు.
అధికారం ఉన్నా, లేకున్నా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవాలను తెలుసుకొని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ధ్యేయంగా, రాబోవు రోజుల్లో రైతులకు అండగా నిలబడి పోరాడుతాం.
ప్రభుత్వం పైన, అధికారులపై ఒత్తిడి పెంచి, రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పిస్తాం.
కాకాణి వెంట పర్యటనలో పలువురు రైతులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app