
చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలో గల రేగుల కుంట చెరువు సుందరికరణలో భాగంగా రూ.60 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టనున్న మురుగు నీరు వ్యవస్థ మల్లింపు (UGD) పైప్ లైన్ నిర్మాణం పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రేగుల కుంట చెరువు కు దశ దిశ మారినది అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగినది అని, మురికి కూపంలాంటి చెరువు స్వచ్చమైన మంచి నీరు లాంటి చేరువుగా తీర్చిదిద్దాడమే ధ్యేయంగా పని చేసి నేడు చెరువును పునరుద్ధరణ చేసిన శుభసందర్భంగా చెరువు లో మురుగు నీరు కలవకుండా 60 లక్షల రూపాయల తో చెరువు చుట్టూ ఇరిగేషన్ శాఖ వారి ఆధ్వర్యంలో చేపడుతున్న మురుగు నీటి మల్లింపు UGD నిర్మాణం పనులు చేపట్టడం జరిగినది అని, UGD పైప్ లైన్ నిర్మాణం పనుల ద్వారా చెరువు లో కలుషిత నీరు కలవకుండా ఉంటుంది అని, స్వచ్ఛమైన వర్షం నీరు తో చెరువు ఎప్పుడు కళకళ గా విరాజిల్లుతుంది అని, చుట్టపక్కల ప్రజలకు, వాకింగ్ వచ్చే ప్రజలకు చక్కటి ఆహ్లదకరమైన వాతావరణం కల్పిస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం పనులు త్వరితగతిన చేపట్టాలని ,అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు .
చెరువు సుందరికరణ లో బాగుంగా అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపట్టడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపట్టడం ద్వారా రేగుల కుంట చెరువును సుందర శోభితవనం గా తీర్చిదిద్దామని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సందీప్ రెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app