ప్రజా సమస్యల పరిష్కారం నిర్వహించిన గ్రివేన్స్

Spread the love

Redressal of Grievances held by Raza

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

బాధితుల ఫిర్యాదు ఆనంతరం పోలీసు అధికారుల తీసుకుంటున్న చర్యలు, కేసు విచారణలో వాస్తవాలను, ఫిర్యాదుదారులకు వివరించాలని అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ డా,,శభరిష్ అన్నారు

.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రివేన్స్ కార్యక్రమం సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ మాట్లాడుతూ…ఫిర్యాదులపై బాధితులు అనుమానాలను నివృత్తి చేస్తూ పారదర్శకతను పెంపొందించాలని సూచించారు. వాస్తవ పరిస్థితులకు పరిశీలించి…


త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సమస్య గల కారణాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్ధాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు

. ఫిర్యాదులో అధికంగా భూ వివాదాలు, కుటుంబ , వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు.

Related Posts

You cannot copy content of this page