సాక్షిత : రక్తదానం ప్రాణదానంతో సమానమంటారు మన పెద్దలు. అన్ని దానాలలో కన్న రక్తదానం ఎంతో ఉత్తమమైనది, శ్రేష్టమైనది. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తులను కాపాడిన వారమవుతాం. రాందేవ్ రావ్ ఆసుపత్రి వైద్య రంగంలో మరో అడుగు ముందుకేసి రాందేవ్ రావ్ ఆసుపత్రి , వి కే అర్ బ్లడ్ సెంటర్ కలిసి సంయుక్తంగా వికేఆర్ బ్లడ్ సెంటర్ ను ఏర్పాటు చేశాయి. నూతనంగా ఏర్పాటు చేసిన వికేఆర్ బ్లడ్ సెంటర్ ను ఆసుపత్రి చైర్మన్ జె. విక్రందేవ్ రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవంలో వికేఆర్ బ్లడ్ సెంటర్ అధ్యక్షులు వెంకట్ , రాందేవ్ రావ్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు జే.మీరా రావు , అపర్ణ రావు , ప్రశాంత్ రెడ్డి , ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ కే. కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీఈవో డాక్టర్ యోబు మాట్లాడుతూ వికేఅర్ బ్లడ్ సెంటర్ ఆసుపత్రి లోని నాలుగవ అంతస్తులో సువిశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ బ్లడ్ సెంటర్ లో ప్రజలందరికీ అందుబాటు ధరల్లో రక్తాన్ని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. బ్లడ్ సెంటర్ ను డాక్టర్ సుమన పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.