SAKSHITHA NEWS


Raghavender Reddy, chairman of the Unity Foundation, responded to the articles in some newspapers.

కొన్ని పత్రికలలో వచ్చిన కథనాలపై స్పందించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి.


సాక్షిత ప్రతినిధి.
నేను గ్రూపు రాజకీయ విభేదాలు సృష్టించడానికి రాలేదు. నిరుపేద ప్రజల కష్టాలను బాగు చేయడం కోసమే వచ్చారాజకీయంగా ఎవరు వచ్చినా సహకరిస్తా గౌరవిస్తా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి విద్య, వైద్యం, ఉపాధి పేద ప్రజలకు అందించాలని లక్ష్యంతో తన సొంత ఖర్చులతో పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఆదుకుంటూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

కొన్ని పత్రిక లలో వచ్చిన కథనంపై స్పందిస్తూ ఐక్యత ఫౌండేషన్ నుండి పల్లె పల్లెలో తిరుగుతూ ప్రజల సుఖ సంతోషాలు తెలుసుకుంటూ తన ఫౌండేషన్ తరపున వారికి ఎలాంటి సహాయం కావాలో తెలుసుకొని సిసి రోడ్లు. ప్రభుత్వ స్కూల్ లలో వసతులు కల్పిస్తూ. యువత కు క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తూ ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ప్రజల బాధలు చూసి కష్టాలు చూసి కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కు ఐక్యత ఫౌండేషన్ తరపున ఆరు అంబులెన్స్ ను కేటాయించి అత్యవసర పరిస్థితుల్లో ఫ్రీగా డాక్టర్లు రిఫర్ చేసిన హైదరాబాద్.

మహబూబ్ నగర్ లోని హాస్పిటలకు తీసుకెళ్లడానికి ఉపయోగపడేలా చేయడం జరిగింది. ఐక్యత ఫౌండేషన్ త్వరలోనే కల్వకుర్తిలో ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుందని కల్వకుర్తి పట్టణంలోనే ఉంటూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవలు చేయడం జరుగుతుందని ఐక్యత ఫౌండేషన్ అంటేనే నిరుపేద ప్రజలకు భరోసాగా నిలుస్తుందని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి రూపకల్పనే తన లక్ష్యమని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం తాను నిరంతరం శ్రమిస్తానని అన్నారు.

తాను ఎవరికి పోటీ కాదని తాను పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రజల్లోకి వచ్చానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. తన లక్ష్యం పురాతనమైన దేవాలయాల పునర్నిర్మాణం, పేద ప్రజలకు వైద్యం విద్య అందించాలని లక్ష్యంతో తాను ముందుకు వచ్చానని ఇందులో ఎలాంటి రాజకీయం లేదని ప్రతి రాజకీయ నాయకులు అంటే తమకు గౌరవం ఉందని తనపై రాజకీయ రంగు పులమడం సరికాదని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గం లోని మొత్తం గ్రామాలలో ప్రతి గ్రామాన్ని కలియ తిరుగుతూ అభివృద్ధిలో నడిపించడమే తన ముందున్న ఏకైక కర్తవ్యం అన్నారు. ఇకముందు కూడా తాను ఎవ్వరికీ పోటీ కాదని తనకు తానే పోటీ అని ఎవరో ఒకరు రాజకీయ నాయకులను తనతో పోల్చవద్దని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తన అదృష్టంతా పేద ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ, ఆమనగల్, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్, కల్వకుర్తి మండలాలలో ఇప్పటివరకు దాదాపుగా కొన్ని మండలాలలో గ్రామపంచాయతీలలో తన సొంత నిధులతో సొంత డబ్బు ఖర్చు చేస్తూ పురాతనమైన దేవాలయాలకు, గవర్నమెంట్ బడులకు, వైద్యం అందనిపేద ప్రజలకు, గ్రామాలలో సిసి రోడ్లు తన సొంత నిధులతో వేయించారు (మరమ్మతులు చేయించారు).

రోడ్డు ప్రమాదాలు జరిగి కాలు చేతులు కోల్పోయిన, మరియు గ్రామాలలో మరణించిన వ్యక్తులకు ఆసరాగా ఉంటూ తన ఐక్యత పౌండేషన్ ద్వారా ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తున్నానని, ఇకమీదట కూడా నిరుపేద ప్రజల కోసంఖర్చు చేస్తానని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు అయితే ప్రజల నుంచి తాను ఏమి ఆశించట్లేదని ప్రజలకు తన ఊపిరి ఉన్నంత వరకు సేవా చేస్తానని, ప్రజల గుండెల్లో అభిమానం సాధించడమే తనకు ఆనందాన్నిస్తుందని రాఘవేందర్ రెడ్డి అన్నారు.

ఒకవేళ రాజకీయంలోకి రావాలి అనుకుంటే తాను అందరికంటే ముందు మీడియా మిత్రులకే తెలియజేస్తానని అలాగే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తారని అన్నారు. రాజకీయాలకు రావాల్సిన సమయం వస్తే ప్రజలందరికీ తెలియజేసి ప్రజలిచ్చే నిర్ణయంతోనే తాను కట్టుబడి ఉంటానని సుంకి రెడ్డిరాఘవేందర్ రెడ్డి అన్నారు.


SAKSHITHA NEWS