SAKSHITHA NEWS


Primary Rythu Seva Co-operative Society in Singarajupalli village

సాక్షిత * : జనగామ జిల్లా,దేవరుప్పుల మండలం,సింగరాజుపల్లి గ్రామంలో ప్రాథమిక రైతు సేవా సహకార సంస్థ (పిఎసిఎస్సీ) అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని , నీర్మాల గ్రామంలో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్యతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజల సౌకర్యార్థం అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందనీ అందులో భాగంగానే 40 వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ ధ్వారా ఇంటి ఇంటికి మంచి నీళ్లు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ అని రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు వేదికలు, రైతు బంధు, ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.


నిర్మలా గ్రామంలో 1కోటి 30 లక్షల రూపాయలు రైతు బందు ఇవ్వడం జరిగిందని అన్నారు.
పేదింటి బిడ్డ కు పెండ్లి కి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ధ్వారా 10116=00 రూపాయలు ఇస్తూ వారికి ఇంటికి పెద్ద దిక్కుగా ముఖ్య మంత్రి నిలిచారని చెప్పారు.


సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకోవడానికి వారికీ 3లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము
అభయ హస్తం పథకం ద్వారా మహిళా లకు 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నామని అన్నారు.
12 కోట్ల రూపాయలుతో సింగరాజుపల్లి, నుండి జీడికల్ వరకు డబల్ రోడ్డు మంజూరు చేయడం జరిగిందనీ ఆయన అన్నారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, రెవెన్యూ డివిజనల్ అధికారి మధు మోహన్,డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాం రెడ్డి, డిసిఓ కిరణ్ కుమార్, డిసిఎస్ఓ రోజా రాణీ, జడ్పీటిసి, పల్లా భార్గవి సుందర్ రాంరెడ్డి, ఎంపీపి బసవ సావిత్రి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, డిఎం.సంధ్యారాణీ, తదితులున్నారు.


SAKSHITHA NEWS