దళిత ఆత్మ గౌరవ పోరాట సంఘం అధ్యక్షులు

Spread the love

దళిత ఆత్మ గౌరవ పోరాట సంఘం అధ్యక్షులు గర్నేపూడి సుధాకర్ పై జరిగిన ఘటన పై కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన దళిత, ప్రజా సంఘం నేతలు

గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ డిఎస్పీ వివి నాయుడు ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి. లేనిపక్షంలో రాష్ట్ర మంతట దళితులమందరం ధర్నా చేస్తాం. ఎస్పీ కి, ఐజీ కి వినతి పత్రం అందజేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని అందుకే ఈ రోజు స్పందన కార్యక్రమం లో కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని తెలిపారు : వివిధ దళిత, ప్రజా సంఘాల నేతలు.

గర్నెపూడి సుధాకర్: లక్ష్మిపురం లోని తన కార్యాలయం లో ఎలక్ట్రికల్ వర్క్స్ చేయిస్తూ ఉన్న నేపథ్యంలో పశ్చిమ డిఎస్పీ వివి నాయుడు వచ్చి తనను డిఎస్పీ తన హోమ్ గార్డ్ తో దురుసు వ్యవహారం తో పిలిపించి దుర్భాషలాడారని, డిఎస్పీ వివి నాయుడు కూడా తెల్ల బట్టలు వేసుకుంటే పెద్ద పిస్తావా ఏంటి అని వ్యంగ్యంగా మాట్లాడి అవమాన పరిచారని, తాను గత 13 సంవత్సరాలనుండి దళిత ఆత్మ గౌరవ పోరాట సంఘం కార్యాలయన్ని లక్ష్మిపురం ప్రాంతంలో నడుపుతున్నట్లు గర్నెపూడి సుధాకర్ తెలిపారు.

మునుపెన్నడు ఇలాంటి ఘటన జరగలేదని ఇది దళితులను కించపరిచేల ఉందని, దళితులకు ఆత్మభిమానం ఉంటుందని తెల్ల బట్టలు వేసుకొని సమాజంలో ఉన్నంతంగా, గౌరవ ప్రదంగా ఉండాలనే ఆకాంక్ష అందరికి ఉంటుందని, Dr.BR అంబేద్కర్ ఫొటో వైపు వేలు చూపి నీచంగా మాట్లాడాడని గర్నెపూడి సుధాకర్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా మాల ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబూ మాట్లాడుతూ , ఈ లక్ష్మి పురం ప్రాతంలో దళితులకు కార్యాలయలు ఉండకూడదా అని వివి నాయుడు కి అలా దుర్భాష లాడే హక్కు ఏ రాజ్యంగం ఇచ్చింది అని నీలాదీశారు. తన కార్యాలయం ఎదుట ఉన్న కారు లోని టైర్ గాలిని తీస్తున్న వివి నాయుడు అదే లక్ష్మి పురంలో కొన్ని వందల వాహనాలు ఉంటాయి వాటి గాలి కూడా తీసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు . కేవలం దళితుడు అనే చిన్న చూపు ఉంది కనుకనే గర్నెపూడి సుధాకర్ పై వివి నాయుడు ఈ అగాయిత్యానికి ఒడికట్టారని కొనియాడారు. దళితులు అనే భావనతో ఇలాంటి చర్యలకు పాల్పడిన వివి నాయుడు ని వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఒకపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం దళితులకు గౌరవం ఇచ్చి విజయవాడ నడి బొడ్డున డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళితులు గర్వించేలా దళితులకు ఒక దళిత పక్ష పాతీగ ఆయన ఉంటే, ఇక్కడ పోలీస్ లు వ్యవహరించే తీరు చాలా నీచంగా ఉందని అన్నారు.

ఈ విషయంపై గుంటూరు ఎస్పీ తుషార్ దూడి కి, ఐజీ పాలరాజు కి కి వినతి పత్రం అందజేయడం జరిగిందని వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో కలెక్టర్ కి వినతి పత్రాన్ని ఇచమని వివి నాయుడు ని సస్పెండ్ చేసి తగు చర్యల తీసుకోవాలని తెలిపినట్లు మాల ఐక్య సేవా సమితి అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబూ తెలిపారు.

వివి నాయుడు పై తగు చర్యలు తీసుకొని పక్షంలో రాష్ట్రంలోని దళిత సోదరులని ఏకం చేసి రాష్టమంతట ధర్నా కార్యక్రమం చేపడతాం అని, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని త్వరగా చర్యలు తీసుకోకపోతే దళిత సోదరులతో కల్సి సీఎం కార్యాలయం ముట్టడి చేస్తామని మాల మహానాడు బత్తుల అనిల్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గర్నెపూడి సుధాకర్ (దళిత ఆత్మ గౌరవ పోరాట సంఘం,బండ్లమూడి స్టాలిన్ బాబూ( మాల ఐక్య సేవా సమితి ) రాష్ట్ర అధ్యక్షులు ,మాల మహానాడు బత్తుల అనిల్, తాడికొండ నరసింహారావు, వేముల ప్రసాద్, డేవిడ్ విలియమ్స్ దళిత, ప్రజా సంఘాలు ఇతర దళిత, ప్రజా సంఘ నేతలు, దళిత ఆత్మ గౌరవ పోరాట సంఘ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page