*శాంతిభద్రతల పరిరక్షణ భేష్ : తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ మహ్మద్ మహమూద్ అలీ*
*-తెలంగాణ ప్రగతిపై 500 డ్రోన్‌లతో కొరియోగ్రఫీ*
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు., జూన్ 4 వ తేదీన సురక్షా దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని దుర్గం చెరువు వద్ద గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించేందుకు దాదాపు 500 డ్రోన్‌లతో కొరియోగ్రఫీ చేయబడ్డాయి. మొట్టమొదటిసారిగా ఏర్పాటుచేసిన ఈ అద్భుతమైన ప్రదర్శనను చూడడానికి ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి శ్రీ మహ్మద్ మహమూద్ అలీ గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్థవంతమైన సేవలను ప్రశంసించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల అతి తక్కువ కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా రూపొందిందిందన్నారు. Peoples Welfare & Developmentలో తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశానికి Role Model గా నిలిచిందన్నారు. “Telangana Implements-Nation Follows“ అనే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకోవడం గర్వకారణమన్నారు.
తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి శ్రీ మహ్మద్ మహమూద్ అలీ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితరులు ప్రదర్శనను చూశారు.
తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ అంజనీ కుమార్, ఐపీఎస్., గారు, రవి గుప్తా, ఐపీఎస్., DGP, ACB, V & E,ప్రిన్సిపల్ సెక్రటరీ హోం శ్రీ జితేందర్, ఐపీఎస్., గారు, టీఎస్పీఏ డైరెక్టర్ శ్రీ సందీప్ శాండిల్య, ఐపీఎస్., ADGP (Welfare, Sports & Home guards) అభిలాష్ బిస్త్, ఐపీఎస్., సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీమతి సౌమ్య మిశ్రా, మహేశ్ భగవత్, ఐపీఎస్., DG (CID)., హైదరాబాద్ సీపీ శ్రీ సివి ఆనంద్, ఐపీఎస్., గారు, సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., రాచకొండ సిపి శ్రీ డిఎస్ చౌహాన్, ఐపీఎస్.,
సంజయ్ కుమార్ జైన్, ఐపీఎస్., ADGP (L&O, మేడ్చల్ కలెక్టర్ శ్రీ అమోయ్ కుమార్, ఐఏఎస్., ADGP (Women Safety, SHE teams and Bharosa) శ్రీమతి షికా గోయల్, ఐపీఎస్., ADGP Operations (Grey Hounds & OCTOPUS) విజయ్ కుమార్, ఐపీఎస్., గారితో పాటు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ శ్రీ నారాయణ నాయక్, ఐపీఎస్., క్రైమ్స్ డిసిపి శ్రీ కల్మేశ్వర్ శింగెనవార్, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి శ్రీ నారాయణ రెడ్డి, ఐపీఎస్., రాజేంద్రనగర్ డిసిపి శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఐపీఎస్., బాలానగర్ డిసిపి శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., మాదాపూర్ డిసిపి శ్రీమతి శిల్పవల్లి, మేడ్చల్ డిసిపి సందీప్, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డిసిపి శ్రీమతి రితిరాజ్, ఐపీఎస్., అడ్మిన్ డిసిపి శ్రీ యోగేష్ గౌతమ్, ఐపీఎస్., EOW డిసిపి శ్రీమతి కవిత, షీ టీమ్స్ డిసిపి శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ శ్రీమతి రష్మీ పెరుమల్, ఐపీఎస్., మాదాపూర్ ఏడిసిపి శ్రీ నంద్యాల నరసింహారెడ్డి, ఇతర ఏడీసీపీలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు.