SAKSHITHA NEWS

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేయనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా సిద్ధమైంది.

ఈ నెల 13వ తేదీన విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 16వ తేదీన కుప్పంలో పర్యటిస్తారు జగన్. చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గంలో వైఎస్సార్ చేయూత నిధులను విడుదల చేయనున్నారు.

18వ తేదీన సిద్ధం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇది ముగింపు సభ. అనంతపురం జిల్లా రాప్పాడులో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టో‌ను విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నవరత్నాలకు మించిన స్థాయిలో హామీలు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

21వ తేదీన అన్నమయ్య రాయచోటి జిల్లాలో పర్యటిస్తారు. రైతుల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేస్తారు. 24వ తేదీన కర్నూలులో ఈబీసీ నేస్తం మూడో విడత నిధులను విడుదల చేస్తారాయన. 27వ తేదీన గుంటూరులో విద్యా దీవెన నాలుగో త్రైమాసికం నిధులను జగన్ విడుదల చేస్తారు.

మార్చి 5వ తేదీన శ్రీసత్య సాయి పుట్టపర్తి జిల్లా నుంచి జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులను విడుదల చేస్తారు. అదే నెల 6వ తేదీన చివరి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.


SAKSHITHA NEWS