SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 22 at 4.30.58 PM

సాక్షిత : _ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ప్రజల వాడుకలో ఉన్న స్మశాన వాటిక మరియు డంప్ యార్డ్ స్థలాన్ని గత కొద్దీ రోజులుగా కొంతమంది అసాంగిక వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించటానికి చేస్తున్న ప్రయత్నాన్ని స్థానిక ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో కలిసి పర్యటించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ స్మశాన వాటిక వాడుకలో ఉంది అని, దీని పై ఎటువంటి అక్రమాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదు అని,ఈ స్మశాన వాటికను రూ. 50 లక్షలతో అభివృద్ధి పరచడానికి ప్రణాళిక సిద్ధం చేసి నిధులు కేటాయింఛామని, అక్రమాలకు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా అధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ స్మశాన వాటిక పరి రక్షించడానికి తగిన చర్యలు చేపట్టేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసేలా కోరుతానని అలాగే వారి సహకారంతో మోడల్ గ్రేవ్ యార్డ్ గా తీర్చిదిద్ది నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమీషనర్ రామకృష్ణ రావు, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్యక్షులు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీల సభ్యులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్ళు, రెవిన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS