కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది

Spread the love

ఏలూరుజిల్లా

ఏలూరు కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది.ఈ నీరు పంట పొలాలకు వెళ్లితే పంటలు తెగుళ్లు బారిన పడి రైతులు నష్టాల బారిన పడే ప్రమాదం తో పాటు సారవంతమైన నేలలు కాస్త నిస్సారవంత మైన నేలలు గా మారే ప్రమాదం ఉందని ఏలూరు కాలువ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది పశువులు ఈ నీరు తాగితే ఉదరకోస గర్భకోస వ్యాధులు ప్రబలి పశువులు ప్రాణాలుకూడా కోల్పోయే ప్రమాదం లేక పోలేదని పాడి రైతులు ఆవేదన చెందుతున్నారని సమాచారం.ఏలూరు కాలువ ద్వారా కలుషిత కెమికల్ నీరు కొల్లేరు ప్రాంతాలకు కూడా సప్లై చానల్స్ చేరుకుని ఆక్వా సాగుకూడా సర్వ నాసనమైపోతుందని చేపల సాగుదారులు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది ఏలూరు కాలువలోకలుషిత నీరు పారుతున్న విషయాన్ని నీటి పారుదల శాఖాధికారులు పరిశీలించి ఈ నీరు ఏలూరు కాలువలోకి విడుదల చేసే ది పరిశ్రమ లా లేక ఎవరైనా వ్యక్తులా
అనేది విచారణ జరిపి కలుషిత నీరు ప్రవాహాన్ని అడ్డుకోవాలని రైతులు.నగర ప్రజలు కోరుతున్నారు.గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి దెందులూరు పర్యటనకు వచ్చినప్పుడు దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి ఏలూరు కాలువ ను ఆధునీకరించి డెల్టా ప్రాంతాలకు తాగునీరు సాగునీరు అందించాలని. కొల్లేరుకు కూడా రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని కోరిన విషయం తెలిసిందే

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page