ప్రతి పోలీస్ స్టేషన్ కు పోలీస్ సైబర్ వారియర్.

Spread the love

*సాక్షిత : *పోలీస్ సైబర్ వారియర్ లకు హెల్ప్ లైన్ ఫోన్ నబర్లు అందించిన ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్.

  • పిర్యాదుదారులకు సైబర్ పిర్యాదులు, కేసుల స్థితిగతులు తెలిపేందుకు సహకారం.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ నందు పోలీస్ సైబర్ వారియర్స్ పనిచేస్తున్నారు, వీరికి సైబర్ వారియర్ హెల్ప్ లైన్ నెంబర్లను, మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ తన కార్యాలయం నందు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతిక తో పాటుగా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి సైబర్ నేరాలకు పాల్పడి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నారని వీరి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వారు ఆన్లైన్ ద్వారా, 1930 జాతీయ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పిర్యాదు నమోదు చేసుకున్నాక వాటి స్థితిగతులు తెలుసుకునేందుకు తిరిగి టోల్ ఫ్రీ 1930 కి ప్రయత్నం చేస్తున్నారు దీని వల్ల పిర్యాదులు చేసుకునే వాటికి ఆటంకం కలుగుతున్నది అని గుర్తించి పిర్యాదుదారులు వారియొక్క సైబర్ నేరాల పిర్యాదులు, కేసుల యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి వీలుగా అన్ని పోలీసు స్టేషన్ ల పోలీస్ సైబర్ వారియర్స్ కు నూతన హెల్ప్ లైన్ నంబర్స్, మొబైల్ ఫోన్స్ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ వారు అందించిన వీటిని ఎస్పీ సిబ్బందికి అందించారు. పిర్యాదు నమోదు చేసుకున్నాక పిర్యాదుదారుడు తన యొక్క కేసు వివరాలు తెలుసుకోవడానికి వెంటనే సంభందిత పోలీస్ సైబర్ వారియర్ సెల్ నంబర్ ను మెసేజ్ ద్వారా పిర్యాదుదారుని చరవానికి పంపడం జరుగుతుంది అని, దీని ద్వారా సైబర్ పిర్యాదులు, కేసుల స్థితిగతులు పిర్యదుదారులు నేరుగా పోలీస్ స్టేషన్ సైబర్ సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ నందు పోలీస్ సైబర్ వారియర్ సిబ్బంది ఉంన్నారని, సైబర్ ఫిర్యాదులు, కేసులు పై ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వడానికి ఈ సిబ్బంది కృషి చేస్తారని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి రాజేష్ మీనా, సైబర్ సెక్యూరిటీ DSP శ్రీనివాసరావు, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page