పగిలిపోవడం వలన వెంటనే చేపట్టిన పైప్ లైన్ పునరుద్ధరణ

Spread the love

Pipe line rehabilitation undertaken immediately after the burst

చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరయ్య కాలనీ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షో రూమ్ సమీపంలో ట్రాన్స్ మిషన్ మంజీర మంచి నీటి పైప్ లైన్ అకస్మాత్తుగా పగిలిపోవడం వలన వెంటనే చేపట్టిన పైప్ లైన్ పునరుద్ధరణ పనులను, జలమండలి అధికారులు కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మంజీర పైప్ లైన్ పగిలిపోయిన విషయం తెలియగానే సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగినది అని, 60 సంవత్సరాల క్రితం వేసిన పైపులు అవడం వలన ,వాటి జీవిత కాలం తగ్గడం వలన, కరెంట్ అన్ ,ఆఫ్ చేసే క్రమంలో గల సమయంలో గ్యాస్ వాయువు ఏర్పడి పగిలిపోవడం జరుగుతుంది

అని, ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, ఇట్టి సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా మంజీర పైప్ లైన్ ఆకస్మికంగా పగిలిపోవడం చాలా దురదృష్టకరం అని, పైప్ లైన్ పగిలిపోవడం వలన చుట్టూ పక్కల ఉన్న అపార్ట్మెంట్ సెల్లర్ లు నిండిపోయినవి అని,HMWS&SB మరియు GHMC,ఎలక్ట్రికల్ అధికారులు సమన్వయం చేసుకొని పైప్ లైన్ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టి, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కృషి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగినది.

పనులలో వేగం పెంచి,నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి మళ్ళీ పునరావృతం కాకుండా చూడలని గాంధీ పేర్కొన్నారు ,మోటర్ల ద్వారా సెల్లార్ లో నీటిని పూర్తి స్థాయిలో తొలగించి అపార్ట్మెంట్ వాసులకు ఉపశమనం కలిపించాలని, వాచ్ మెన్ లకు నిత్యావసర సరుకులను అందించడం జరిగినది .

అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తానని, ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి వస్తే పరిష్కరిస్తానని, అన్ని వేళలో అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో అధికారులు , HMWS &SB ట్రాన్స్ మిషన్ GM మాణిక్యం, DGM మహ్మద్ అజారుద్దీన్, మేనేజర్ అన్వర్ మరియు GHMC AE సంతోష్ రెడ్డి మరియు చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,తెరాస నాయకులు సందీప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page