SAKSHITHA NEWS

Physical examination under surveillance

నిఘా నీడలో దేహధారుడ్య పరీక్షలు…
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలీస్ ఉద్యోగాల ఎంపిక పక్రీయ…
ఐదవరోజు హజరైన1098 మహిళ అభ్యర్థులు
తుది పరీక్షలకు అర్హత సాధించిన 700 అభ్యర్థులు

.
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

పోలీస్ ఉద్యోగాల ఎంపిక పక్రియలో భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న దేహధారుఢ్య పరీక్షలు నిఘా నీడలో ప్రశాంతంగా కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ , సెన్సార్, సీసీ కెమెరాల రికార్డులు వంటి అధునిక సంకేతిక పధ్ధతులలో జరుగుతున్న శారీరక ధారుడ్య పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదవరోజు 1098 మహిళ అభ్యర్థులు హజరైయ్యారని,


అందులో తుది పరీక్షలకు 700 మంది మహిళ అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు. 1295 అభ్యర్థులు హాజరు కావల్సివుండగా 1098 హజరైయ్యారు. హజరైన మహిళ అభ్యర్థులకు చెందిన డాక్యుమెంట్స్ పరిశీలించి, బయోమెట్రిక్ , రిస్ట్ బ్యాండ్ , ఆర్ ఎఫ్ ఐ డీ జాకెట్ ధరింప చేశారు.

ఆనంతరం 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి ఎత్తు, లాంగ్ జంప్, షార్ట్ పూట్ పాల్గొన్నారు.
పరేడ్ గ్రౌండ్స్ లో వైద్యులతో కూడిన మెడికల్ బృందం, అంబులెన్స్ అందుబాటులో వుంచారు.


SAKSHITHA NEWS