కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాదయాత్ర

Spread the love

Padayatra with Corporator Uppalapati Srikanth

సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని రెడ్డి ఎనక్లేవ్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై GHMC ఇంజనీరింగ్ విభాగం , జలమండలి అధికారులు మరియు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రెడ్డి ఎనక్లేవ్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ,సమస్యలను పరిగణలోకి తీసుకోని ,వారి విజ్ఞప్తి మేరకు కాలనీ లో పాదయాత్ర చేపట్టడం జరిగినది

అని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత , సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా కాలనీ లో నెలకొన్న అన్ని సమస్య లను త్వరలోనే పరిష్కరిస్తానని, రోడ్లు, డ్రైనేజి పనులు చేపడుతామని అదేవిధంగా కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు,అక్కడికి అక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగినది.

అదేవిధంగా కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని మరియు . ముఖ్యంగా డ్రైనేజి, మంచి నీరు , రోడ్లు , వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరావడం జరిగింది అని.సమస్యలపై ప్రభుత్వ విప్ గాంధీ సానుకూలంగా స్పందించి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు,విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి గాని కార్పొరేటర్ దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.


,మెరుగైన జీవన ప్రమాణాలకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు అదేవిధంగా మియాపూర్ డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీకాంతిని, AE శివ ప్రసాద్ , వర్క్ ఇన్స్పెక్టర్ రఘు, నవీన్ జలమండలి అధికారులు DGM నాగప్రియ, మేనేజర్ సాయి చరిత, తెరాస నాయకులు మాధవరం గోపాల్, ప్రతాప్ రెడ్డి, రెడ్డి ఎనక్లేవ్ కాలనీ వాసులు జ్ఞానశేఖర్ ,శ్రీకాంత్, దామోదర్ రెడ్డి,అమరెందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page