అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె మండలం మంగంపేట గ్రామపంచాయతీలోని పలు సమస్యలు పరిష్కరించాలని రాజంపేట సబ్ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన రైల్వే బోర్డు మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి
మంగంపేట డేంజర్ జోన్ పరిధిలో నున్న కాపు పల్లె హరిజనవాడ అరుంధతివాడ గ్రామాలకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసి చట్ట ప్రకారం బాధితులకు రావాలిసినటు వంటి మెరుగైన ప్యాకేజీ (కాంపన్సేషన్) అందించి వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఉద్యోగం వద్దన్నవారికి వన్ టైం సెటిల్మెంట్ కింద పరిహారం ఇవ్వాలని ప్రతి ఇంటిని త్వరగా పరిహారం ప్రకటించాలని కోరారు అంతేకాకుండా
జగనన్న ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఇంటింటికి రేషన్ కార్యక్రమంలో భాగంగా రేషన్ సరఫరా చేసే బండికి తగు మరమ్మతులు చేయించి మంగంపేట గ్రామపంచాయతీ ప్రజలకు రేషన్ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని మంగంపేట ఆర్ఆర్ సెంటర్ 1 లో ఉన్నటువంటి 1085 ఇళ్లకు పోసిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయించగలరని ఏపిఎం డి సి ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మరియూ క్రీడా మైదానానికి స్థలం సేకరణ జరపాలని ఆర్ ఆర్ సెంటర్ 1 లోని 1098 సర్వే నంబర్ లోని క్రిస్టియన్ స్మశాన వాటికను చదును చేయించి అందుబాటులోకి తెచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని మంగంపేట గ్రామంంలోని వారికి గతంలో జగనన్న లేఔట్ లు 72 మందికి మంజూరు చేసి 20 మందికి పట్టాలిచ్చారని జగనన్న లేఔట్ల కు సంబందించిన రోడ్లు విద్యుత్ నీటి రవాణా సౌకర్యం లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అలాగే అగ్రహారం గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తగు సౌకర్యాలు కల్పించాలన్నారు గతంలో ఎన్నో సార్లు అధికారులకు సమస్యలు విన్నవించడం జరిగిందని గౌరవ సబ్ కలెక్టర్ కు పై సమస్యలను విన్నవించగా అయన సానుకూలంగా స్పందించి త్వరలో సదరు ప్రాంతాలను సందర్శించి తగు న్యాయం చేస్తామన్నారని తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా ఒక మీడియా ప్రకటనలో తెలిపారు ఆయనతో పాటు వార్డు మెంబెర్ కొవ్వూరు రామలక్ష్మమ్మ, గురసాల శారదమ్మ శ్రీలత, రమణ, విజయ్ కుమార్ చైతన్య రవికుమార్ వెంకటేష్,సురేష్ సుబ్రహ్మణ్యం