SAKSHITHA NEWS

స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్

తెలంగాణ ఐఏఎస్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్ తగిలింది. దివ్యాంగులను కించపరిచేలా స్మిత కామెంట్స్ చేశారని.. ఆమె చేసిన వాఖ్యాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు.

యూపీఎస్సీ చైర్మన్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. పిటిషనర్ కు ఉన్న అర్హతను ప్రశ్నించింది. పిటిషనర్ ఒక వికలాంగురాలను కోర్టుకు తెలిపారు అడ్వకేట్. పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన ఉద్యోగంలో కోటా ఎందుకని.. డెస్కుల్లో పని చేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలన్నారు స్మితా సబర్వాల్.


SAKSHITHA NEWS