హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ హైటెన్షన్ లైన్ రోడ్డు లో గల కిందికుంట పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ కిందికుంట పార్క్ లో వాకర్స్ విజ్ఞప్తి మేరకు వాకర్స్ తో కలిసి పార్క్ ను పరిశీలించడం జరిగిందని పార్క్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు సానుకూలంగా స్పందిస్తూ పార్క్ లోకి వాకింగ్‌కు వచ్చేవారికి ఇబ్బందులు తలేత్తకుండా వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇప్పటికే ఓపెన్ జిమ్ ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని అదే విధంగా సందర్శకుల కోసం పార్క్ గోడలపై వినూత్నమైన చిత్రాల వేయించి, పార్క్ చుట్టుపక్కల మొక్కలు, పుట్‌పాత్‌లపై బెంచీలను ఏర్పాటు చేస్తామని. రాబోయే తరాలకు పచ్చదనాన్ని ఇవ్వడానికి తమవంతు బాధ్యతగా స్థానికులందరూ పార్కులను సంరక్షించుకోవాలని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ హైటెన్షన్ లైన్ రోడ్డు లో గల కిందికుంట పార్క్
Related Posts
వినాయకునికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS వినాయకునికి ప్రత్యేక పూజలు || కుత్బుల్లాపూర్నియోజకవర్గం 128 డివిజన్ చింతల్ వాసులు నిర్వహించిన వినాయక ఉత్సవాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని ప్రజలందరూ ఆయువు…
పెద్దపెల్లి జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన
SAKSHITHA NEWS పెద్దపెల్లి జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న రామగుండం సిపి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పెద్దపల్లి జిల్లా :పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం తెలం గాణ ఉప ముఖ్యమంత్రి మల్లు…