
ఉద్యోగులపై విజిలెన్స్ ఉండాలి: డిప్యూటీ సీఎం
AP: ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్ ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోవడం వారి పనితీరుపై ప్రభావం చూపుతోందన్నారు. శాఖాపరమైన కేసుల వివరాలను నివేదికను మూడు వారాల్లోగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
