కంటి వెలుగును ప్రజలు వినియోగించుకోవాలి

Spread the love

People should use eye light

కంటి వెలుగును ప్రజలు వినియోగించుకోవాలి:
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్


సాక్షిత సికింద్రాబాద్ : నుంచి నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకొని తమ నేత్ర వ్యాధుల ను నివారించుకోవాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 19వ తేది నుంచి సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితఫలమండీ, బౌద్దనగర్ డివిజనల పరిధులలో 8 కేంద్రాల్లో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు పద్మారావు గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19 వ తేది నుంచి జూన్ 30 తేది వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.


— సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో కనీసం 2.94 లక్షల మందికి ఉచితంగా పరిక్షలు నిర్వహించాలని లక్షంగా నిర్ధారించుకున్నామని సెలవు రోజులు మినహా ఒక్కోరోజు 200 మందికి స్క్రీనింగ్ నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైతే వెంటనే కంటి అద్దాలను ఉచితంగా అందిస్తారని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.


— సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బోయ బస్తీ కమ్యూనిటీ హాల్ (అడ్డగుట్ట), BJR కమ్యూనిటీ హాల్ (అడ్డగుట్ట), ప్రొఫెసర్ జయ శంకర్ స్టేడియం (తార్నాక డివిజన్)నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ (తార్నాక), చింత బావి కమ్యూనిటీ హాల్ (మెట్టుగూడ), ఉప్పరి బస్తి కమ్యూనిటీ హాల్ (సీతాఫల మండీ), UPHC కుట్టి వెల్లోడి (సితఫలమండీ), బౌద్దనగర్ కమ్యూనిటీ హాల్ (బౌద్దనగర్) ప్రాంగణాలల్లో కంటి వెలుగు శిబిరాలను తొలుత ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ ఎంపిక చేసిన బృందాలు ఇంటింటికీ వెళ్లి ఆయా నివాసులకు సమాచారం అందించాయని పేర్కొన్నారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో 152 కేంద్రాల్లో 45.38 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారని, రీడింగ్ సమస్యలు ఉన్న వారికి వెంటనే కంటి అద్దాలు అందిస్తారని అయన వివరించారు. ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని నేత్రాలను పరిరక్షించుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మెట్టుగూడ లోని చింత బావి కమ్యూనిటీ హాల్ లో కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత, అధికారులు-నాయకులతో కలిసి , ఉదయం 10.30 గంటలకు కుట్టి వెల్లోడి UPHC కార్పొరేటర్ కుమారి సామల హేమ, అధికారులు-నాయకులతో కలిసి కంటి వెలుగు శిబిరాలను లాంచనంగా ప్రారంభిస్తారు. అనంతరం సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో బీ ఆర్ ఎస్ నేతలు మల్లూరి అనిల్ కుమార్, గరికపోగుల చంద్రశేఖర్, తోబుల విష్ణు రూపొందించిన ‘పజ్జన్న అధ్వర్యంలో లష్కర్ అభివృద్ధి క్యాలెండర్’ ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆవిష్కరిస్తారు.

Related Posts

You cannot copy content of this page