చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద

Spread the love

People around the pond are plagued by mosquitoes

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద ఎక్కువగా ఉందని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి ఎంటోమొలజి సిబ్బందితో కలిసి ఎల్లమ్మచెరువులో డ్రోన్ యంత్రం సహాయంతో దోమల నివారణ మందులు పిచికారి చేయడం జరిగింది.

అదేవిధంగా చెరువులో పేరుకున్న గుర్రపు డెక్కను సిబ్బందితో తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,

తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని చెరువులలో గాని వేయవొద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాములుగౌడ్, మల్లేష్, ఎంటోమొలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, ఎంటోమొలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page