కొటికలపూడిలో సంక్షేమ పథకాలకు రూ.15.09 కోట్లు చెల్లింపు.
మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 7.3.2023.
ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో సంక్షేమ పథకాలు నిమిత్తం రూ.15,09,06,670లను ఇప్పటివరకు చెల్లించినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
కొటికలపూడి గ్రామంలో రెండవ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జగనన్న విద్యాదీవన వసతి దీవెన కింద రూ.94,99,104లు, జగనన్న అమ్మఒడి కింద రూ.1,20,17,000లు, కాపు నేస్తం కింద రూ.1,35,000లు, వైయస్సార్ చేయూత కింద రూ.1,31,25,000లు, వాహన మిత్ర కింద రూ.17,60,000లు, పాస్టర్లకు రూ.25,000లు, జగనన్న తోడు కింద రూ.6,40,000లు, ఈబీసీ నేస్తం కింద రూ.2,40,000లు, వైయస్సార్ ఆసరా కింద రూ.1,10,44,684లు, వైయస్సార్ బీమా కింద రూ.14,00,000లు, జగనన్న చేదోడు కింద రూ.2,30,000లు, వైయస్సార్ పెన్షన్ కానుక కింద రూ.4,15,50,150లు, వైయస్సార్ రైతు భరోసా కింద రూ.97,47,000లు, పేదలందరికీ ఇళ్ల పట్టాలు కింద రూ.4,86,40,000లు, వైయస్సార్ సున్నా వడ్డీ కింద రూ.7,53,732లు, వైయస్సార్ కళ్యాణమస్తు కింద రూ.1,00,000లు చెల్లించామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏనాడు పేదలకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కాలేదని స్పష్టం చేశారు. అవినీతికి తావు లేకుండా పూర్తిగా పారదర్శకంగా పింఛన్లు తప్ప మిగతా పథకాల సొమ్ము అంతా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినట్లు పేర్కొన్నారు. సీఎం జగనన్న సమర్ధతకు ఇది నిదర్శనం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి , ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న దుర్గాప్రసాద్ , వైస్ ఎంపీపీ బండి నాగమణి , మండల వైసీపీ అధ్యక్షులు బొంతా సాంబశివరావు , సచివాలయ కన్వినర్ల మండల కో ఆర్డినేటర్ లంకె అంక మోహనరావు , సర్పంచ్ రెంటపల్లి నాగరాజు , కేతనకొండ సర్పంచ్ నళిని విన్ స్టన్ , ఎంపీటీసీ సభ్యులు కొమ్మూరు బాల కోటేశ్వరరావు , బండి వెంకట్రావు , వైసీపీ అధికార ప్రతినిధి కుమ్మరి నాగరాజు , నల్లమోతు చిన్నయ్య , మునగాల శివారెడ్డి , సొసైటీ చైర్ పర్సన్ సయ్యద్ జానీ , నల్లమోతు బాబురావు , బేతపూడి కృష్ణవేణి , సూదిరెడ్డి సురేష్ , అధికారులు తదితరులు పాల్గొన్నారు.