SAKSHITHA NEWS

అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం.

ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారు..

కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. మీరు కౌరవులు

జగన్ ఓటమి ఖాయం.. మేం అధికారంలోకి రావడం ఖాయం .

మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ మేం అండగా ఉంటాం

30 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటున్నారు .

2018 నుంచి డీఎస్సీ ప్రకటన రాలేదు .

డీఎస్సీ కోచింగ్‌కు అవనిగడ్డ ప్రధాన కేంద్రం .

డీఎస్సీ వేస్తామని జగన్ హామీ ఇచ్చారు .

పోలీసు ఉద్యోగి కష్టనష్టాలు నాకు బాగా తెలుసు .

మేం వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటాం .

ఈ పదేళ్లలో మా పార్టీ అనేక దెబ్బలు తింది .

ఆశయాలు, విలువల కోసం మేం పార్టీ నడుపుతున్నాం .

యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటా .

ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓటు చీలకూడదని అంటున్నా .

మనం, మన పార్టీల కంటే ఈ రాష్ట్ర నేల చాలా ముఖ్యం .

రాష్ట్ర యువత.. ఎంతో విలువైన దశాబ్ద కాలం కోల్పోయారు .

కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఉన్నాయి .

రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పా .

మెగా డీఎస్సీ పేరుతో యువతను మోసం చేశారు .

వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించడమే మా లక్ష్యం .

ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వమే వస్తుంది .

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎందరికి ఉద్యోగాలు వచ్చాయి .

వైసీపీ ప్రభుత్వం చెప్పే అభివృద్ధి ఎక్కడ?

జగన్ అద్భుతమైన పాలకుడైతే నాకు రోడ్డుపైకి వచ్చే అవసరం లేదు .

జగన్ వేల కోట్ల అవినీతి చేసినట్లు రుజువైంది .

ఈ దేశ ప్రధానికి జగన్ గురించి తెలియదా?

మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు .

అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు .

మూడు తరాలుగా రాజకీయాలు చేసే వ్యక్తితో పోరాటం చేస్తున్నా.

డబ్బుమీద, నేలమీద నాకు ఎప్పుడూ కోరిక లేదు .

డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు .

నా నైతిక బలంతోనే ఎంతో బలమైన జగన్‌తో గొడవ పెట్టుకుంటున్నాం .

ముఖ్యమంత్రి పదవి కోసం నేను వెంపర్లాడను .

వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది .

ఓట్లు కొనేందుకు నా దగ్గర డబ్బు లేదు .

బైజూస్‌ను బత్తాయి జ్యూస్‌లా పిండేశారు .

వైసీపీ హయాంలో 3,88 లక్షలమంది విద్యార్థులు డ్రాపవుట్ అయ్యారు .

మీరు చేసిన గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ సర్వే నిజమా.. కాదా..

రాష్ట్రంలో వేలమంది పిల్లలు ఎందుకు చనిపోయారో శ్వేతపత్రం ఇవ్వాలి .

మా ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీపై ప్రత్యేక దృష్టి సారిస్తా.

యువతకు అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తానని హామీ ఇస్తున్నా .

20 ఏళ్లు దాటాక సొంతకాళ్లపై నిలబడాలని యువత కోరుకుంటారు .

నిరుద్యోగి కష్టం నాకు బాగా తెలుసు .

ఉద్యోగం రానివారికి నిరుద్యోగ భృతి ఇప్పించేందుుకు ప్రయత్నిస్తా

నేను ఎలాంటి వాడినో పదేళ్లుగా మీరు చూస్తున్నారు .

కృష్ణాజిల్లాలో 86 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి .

కృష్ణాజిల్లా ప్రజలకు ఇంటింటికీ తాగునీరు ఇస్తాం .

జీవితంలో కిందనుంచి వచ్చినవారికి ఆత్మగౌరవం ఉంటుంది .

నాపై కేసులు పెడతామంటున్నారు.. కేసులు పెట్టుకో జగన్ .

దేశభక్తి ఉన్నవారు రాజకీయ నాయకులైతే ఎలా ఉంటుందో చూపిస్తాం .

అవనిగడ్డలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోంది

నేను అసెంబ్లీలో ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది .

నేను ఎక్కిడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా .

ఈసారి సరైన వ్యక్తులను గెలిపించుకోకుంటే ఒక తరం నష్టపోతుంది .

జగన్ ముద్దుమురిపాలతో పదేళ్లు జనంలో తిరిగారు .

ప్రజలు జగన్‌ను దేవుడని మొక్కారు.. ఆయన దయ్యపై పీడిస్తున్నారు .

మనల్ని కులాలుగా వేరు చేస్తున్నారు.. కులం కంటే మానవత్వం గొప్పది .

నేనెప్పుడూ ఎవరిలో కులం చూడలేదు.. గుణమే చూశా .

ప్రతి ఒక్కరిలో గుణం, ప్రతిభ, సామర్థ్యం మాత్రమే చూస్తా.

కులం చూసి నేను ఎవరనీ దగ్గరకు తీసుకోలేదు .

కీలకమైన పదవులన్నీ ఒకే కులం వారితో నింపకుండా చూసుకుంటా

టీడీపీ-జనసేన వ్యాక్సిన్ మాత్రమే వైసీపీ మహమ్మారికి మందు

సైకిల్, గ్లాస్ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం .

ఏపీ అభివృద్ధిని వైసీపీ ఫ్యాన్‌కు ఉరి వేశారు .

నేను బీజేపీతో వెళ్తే అధికారానికి సరిపోయే సీట్లు వస్తాయో లేదో తెలియదు .

వచ్చే ఎన్నికల్లో రిస్క్ తీసుకోలేను .

జగన్ పరిస్థితి.. ఓడిపోయే ముందు హిట్లర్ పరిస్థితిలా ఉంది

రామ, రామణ యుద్ధం జరుగుతున్నప్పుడు నేను ఓ పక్షం వైపు ఉంటా .

ఏపీ శ్రేయస్సు కోసమే టీడీపీ-జనసేన కలిశాయి .

వైసీపీకి 175 కాదు.. 15 సీట్లు వస్తే గొప్ప.

: జనసేన అధినేత పవన్ కల్యాణ్


SAKSHITHA NEWS