SAKSHITHA NEWS

సిద్దిపేట : పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లలను తల్లిదండ్రులు మరింత శ్రద్ధగా చదివించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. నియోజకవర్గంలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాను అందించిన డిజిటల్‌ కంటెంట్‌ పుస్తకాలను వినియోగించాలన్నారు. మెరుగైన మార్కులతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు ఉదయాన్నే నిద్రలేపాలని, టీవీలకు దూరంగా ఉంచాలన్నారు. పాఠశాలకు నిత్యం వెళ్లేలా అనుశీలన చేయాలన్నారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇప్పిస్తామన్నారు. ఈ సందర్భంగా చిన్నకోడూరు మండలం అల్లీపూర్‌ గ్రామానికి చెందిన స్వామి హరీశ్‌రావు ఫోన్‌కు స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పొద్దుతిరుగుడు సాగు చేసిన రైతులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. సిద్దిపేట, చిన్నకోడూరు మార్కెట్‌యార్డులలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయన్నారు.

WhatsApp Image 2024 01 05 at 7.58.28 PM

SAKSHITHA NEWS