సీతారామ కళ్యాణం లో పండి రఘురాం పట్టు వస్త్రాలు సమర్పణ

Spread the love

కోవూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నేల తాళాలతో మంగళ వాయిద్యాల మధ్య జరిగింది ఈ మహోన్నతమైన కళ్యాణానికి బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్, పండి రఘురాం సతీసమేతంగా విచ్చేసి ఆ రాముల వారి ఆశీర్వాదం తీసుకొని వస్త్రాలు పూజ సామాగ్రి కళ్యాణానికి సమర్పించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ విశేష జన వాహిని మధ్య సీతారాముల కళ్యాణం జరగడం చాలా కమనీయమని అందరికీ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పెట్టడం జరిగిందని అందరూ వాటిని తీసుకుని పోవాలని మరొకసారి కోవూరు నియోజవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి సురేష్ రెడ్డి, పూజారులు నాగరాజాచార్యులు స్వామి, నందకిషోర్ స్వామి, సాయి పనిధీర్ శర్మ, మరియు శ్రీకర్, భక్తి జనం పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page