హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదాపడిది. కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు. ఈ నెల 20న జరగాల్సిన ప్రజాభేరి సభను మరొక రోజు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో పాటు మరి కొందరు నాయకులు ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పాలమూరు ప్రజాభేరి పేరుతో సభ నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది.
అయితే పాలమూరు సభకు ఆహ్వానిస్తూ. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈ నెల మొదటి వారంలోనే పీసీసీ లేఖ రాసింది. కానీ ఇప్పటీ వరకు ప్రియాంగ గాంధీ షెడ్యూల్ ఖరార్ కాకపోవడంతో సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మరి కొందరు నాయకుల చేరికలు మరింత ఆలస్యం కానుంది. అయితే ఈ నెల 23 లేదా 28, 30వ తేదీల్లోని ఏదో ఒక రోజు సభ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం పాలమూరు జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పటికి ప్రియాంక గాంధీ పర్యటన ఖరార్‌కాకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు రావడం ఖాయమని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి