ఆంధ్ర ప్రజల గుండె చప్పుడే ముఖ్యమంత్రి జగన్

ఆంధ్ర ప్రజల గుండె చప్పుడే మన ముఖ్యమంత్రి జగన్ !!— మంత్రి జోగి రమేష్ సాక్షిత : పలు సంక్షేమ పథకాల ప్రదాత, విద్యా సంస్కరణల ఆద్యుడు ఆరోగ్య సంరక్షకుడు, ప్రతి ఇంటా పెద్ద కొడుకు, అందరి బంధువు ఆంధ్ర ప్రజల…

ఆసరా పించన్ల గుర్తింపు కార్డుల పంపిణీ

సాక్షిత : ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు మెట్టుగూడ డివిజన్ కు సంబంధించిన ఆసరా పించన్ల గుర్తింపు కార్డుల పంపిణీ శిబిరం గురువారం సితాఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. మేట్టుగుడా కార్పొరేటర్ శ్రీమతి…

నామినేషన్ వేనున్న పాల్వాయి స్రవంతి

సాక్షిత *నల్లగొండ జిల్లామునుగోడు నియోజకవర్గం నామినేషన్ వేనున్న పాల్వాయి స్రవంతి….హాజరుకానున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎల్పీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క నల్లగొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి…

50 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు

50 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం…! సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తూరు సీతయ్య నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , 50 లక్షల వ్యయంతో నూతనంగా సిసి రోడ్డు పనులను…

నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ శ్రీ పల్లారాజేశ్వర్ రెడ్డి , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…

చండూర్ మండల ఎన్నికల పరిశీలకుడిగా విప్

చండూర్ మండల ఎన్నికల పరిశీలకుడిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *సాక్షిత : * మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా చండూరు మండలం లోని పులిమేల గ్రామం ఇంచార్జ్ శాసన సభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి తో కలిసి…

బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభం చేసిన

సాక్షిత : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నాంపల్లి మండలం దామెర, నెరేళ్లపల్లి గ్రామాలలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బయలు దేరే బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభం చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి…

మునుగోడ్ నియోజకవర్గ ఉప ఎన్నిక

సాక్షిత : మునుగోడ్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో TRS అభ్యర్ధి గెలుపు ఖాయం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్తం చేశారు. గురువారం సనత్ నగర్ లో 3.87 కోట్ల…

ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరుని కలవాలి.

ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరుని కలవాలి.. ఇంఛార్జిలతో సమావేశమైన ఎమ్మెల్యే… సాక్షిత : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామంలో 5, 6వ వార్డుల్లో 100 ఓట్లకు ఒకరిగా నియమించిన ఇంఛార్జిలతో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమావేశం అయ్యారు. ఈ…

క్రేజీ ఫెలో’ లో మంచి మ్యాజిక్ వుంది..ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది : ఆది సాయికుమార్‌ ఇంటర్వ్యూ

క్రేజీ ఫెలో’ లో మంచి మ్యాజిక్ వుంది..ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది : ఆది సాయికుమార్‌ ఇంటర్వ్యూ మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘క్రేజీ ఫెలో’.  దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో ఆది సాయికుమార్‌  విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘క్రేజీ ఫెలో’ ఎలా వుండబోతుంది ? చాలా మంచి ఎంటర్ టైనర్ . సినిమా పట్ల అందరం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాం. దర్శకుడు ఫణి చాలా మంచి కథ రాసుకున్నాడు. చాలా నీట్ గా ప్రజంట్ చేశాడు కామెడీ ఆర్గానిక్ గా వుంటుంది. అందరికీ నచ్చే కథ ఇది. కె.కె.రాధామోహన్‌ గారికి కూడా చాలా బాగా నచ్చి సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. క్రేజీ ఫెలో లో మంచి మ్యాజిక్ వుంది. మీ పాత్ర ఎలా వుండబోతుంది ? ఇందులో నా పాత్ర చాలా క్రేజీగా వుంటుంది. తొందరపాటు క్యారెక్టర్. చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే క్యారెక్టర్. చాలా ఎంటర్ టైనింగా వుంటుంది. నర్రా శ్రీనివాస్, అనీస్ కురువిల్లా పాత్రలతో పాటు మిగతా పాత్రలు కూడా బావుంటాయి. ప్రతి క్యారెక్టర్ లో ఫ్రెష్ నెస్ వుంటుంది. ఇందులో చాలా ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నారు కదా ?  దీనికి కారణం దర్శకుడే. ఒక చేంజ్ ఓవర్ కావాలని అడిగారు. ప్రేమ కావాలి సినిమాకి రామ్ అనే హెయిర్ స్టయిలీస్ట్ చేశారు. క్రేజీ ఫెలో కోసం మళ్ళీ కలసి పని చేశాం. కొంచెం బరువు కూడా తగ్గాను. చాలా మంది లవ్లీ , ప్రేమ కావాలి లాంటి సినిమాలు చేయమని అడుగుతారు. అలాంటి వైబ్ వుండే సినిమా క్రేజీ ఫెలో. మీ పర్శనల్ గా ఏ జోనర్ ఇష్టం ? నాకు ఎంటర్ టైనర్ ఇష్టం. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలు అలా విజయం సాధించినవే . అలాగే రియలిస్టిక్ స్క్రిప్ట్ ఒకటి చేయాలనీ వుంది. లవ్లీ, ప్రేమ కావాలి తర్వాత మీకు నచ్చిన సినిమాలు ? ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కి చాలా మంచి పేరు వచ్చింది. ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాకి కూడా మంచి రెస్పాన్ వచ్చింది. అలాగే తీస్ మార్ ఖాన్ సినిమా చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు క్రేజీ ఫెలో కూడా ఎంజాయ్ చేస్తూ చేశా. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. మీ కెరీర్ విషయంలో నాన్నగారి జోక్యం ఎలా వుంటుంది ? కొన్ని కథలు నాన్న వింటారు. కొన్ని నేను విని తొందర పాటు నిర్ణయాలు  తీసుకుంటాను (నవ్వుతూ)ముందు చక్కగా వినమని చెబుతారు. ఆయన జడ్జ్ మెంట్ బావుటుంది. ఇకపై చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటూ చేయాలి. హీరోయిన్స్ గురించి ? ఇద్దరు హీరోయిన్స్ అద్భుతంగా చేశారు. దిగంగన సూర్యవంశి కి మంచి పేరు వస్తుంది. మంచి డ్యాన్సర్.అలాగే మిర్నా కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పాత్ర కూడా బావుటుంది. కామెడీ చేయడంలో సవాల్ వుంటుందా ? ఈ సినిమా కామెడీ విషయంలో దర్శకుడు చాలా పర్టిక్యులర్. టైమింగ్ విషయంలో చాలా ఖచ్చితంగా వుంటారు.  కామెడీ చాలా సహజంగా చేశాం. కామెడీ సీన్స్ అన్నీ హిలేరియస్ గా వుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ? ఆర్ఆర్ ద్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ బావుంటాయి. తను మంచి లిరిక్ రైటర్ కూడా. చాలా హార్డ్ వర్క్ చేసి మంచి ఆల్బం ఇచ్చాడు. ప్రేక్షకులకు క్రేజీ ఫెలో ఎలాంటి ఇంపాక్ట్ ని ఇస్తుంది ? మంచి ఎంటర్ టైనర్ చుశామనే ఫీలింగ్ ఇస్తుంది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. సినిమా చుసిన ప్రేక్షకులు బావుందని పదికి చెప్పుకునేలా వుంటుంది. ఇందులో మంచి ఎమోషన్ కూడా వుంది. క్రేజీ ఫెలో మీ కెరీర్ కి ఎంత ముఖ్యం ? చాలా రోజుల తర్వాత మంచి చేంజ్ ఓవర్ వచ్చింది. లుక్ బావుంది.  పాటలు, డైలాగులు , కాస్టింగ్ , గుడ్ వైబ్ తో ప్రేక్షకుల ముందుకు వెళుతుంది. సినిమాకి మంచి విజయం వస్తుందనే ఆశిస్తున్నాను. కొత్తగా చేయబోతున్న సినిమాలు ? టాప్ గేర్ అనే థ్రిల్లర్,  మరో క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నా. ఇంకొన్ని కథలు చర్చల్లో వున్నాయి. అలాగే ‘పులి మేక’ అనే వెబ్ సిరిస్ కూడా చేస్తున్నా. ఆల్ ది బెస్ట్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE