‘క్రేజీ ఫెలో’ అందరూ ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : నిర్మాత కె.కె.రాధామోహన్‌ ఇంటర్వ్యూ

‘క్రేజీ ఫెలో’ అందరూ ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : నిర్మాత కె.కె.రాధామోహన్‌ ఇంటర్వ్యూ మంచి స్క్రిప్ట్‌ లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో.  దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో నిర్మాత కె.కె.రాధామోహన్‌ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. క్రేజీ ఫెలో దసరా, దీపావళికి మధ్యలో విడుదలౌతుంది కదా.. ఇది ఎలాంటి సమయం అనుకుంటున్నారు ? కోవిడ్ కారణంగా ఆగిన చిత్రాలు గత మూడు నెలలుగా వరుసగా విడుదలౌతున్నాయి. సెప్టెంబర్ లో విడుదల చేద్దామని అనుకున్నాం.  కానీ చాలా సినిమాలు వరుసలో వున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అక్టోబర్ 14 మంచి డేట్ అనిపించింది. నవంబర్ డిసెంబర్ లో కూడా వరుసగా సినిమాలు వున్నాయి. అయితే ప్రస్తుతం ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం పెద్ద సవాల్. క్రేజీ ఫెలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దినితో పాటు వైవిధ్యమైన ప్రమోషన్స్ చేస్తున్నాం. రెండు వెహికల్స్ తెలుగు రాష్ట్రాలలో తిరుగుతున్నాయి. ప్రతి చోట ట్రైలర్, సాంగ్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశాం. దీనితో పాటు టీవీ కమర్షియల్, పోస్టర్స్, గూగుల్ యాడ్స్ ,అన్ని రకాలుగా కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాం. క్రేజీ ఫెలో మంచి వినోదం వున్న చిత్రం. ప్రేక్షకులు థియేటర్ కి వస్తారనే నమ్మకం వుంది. కథలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి ? క్రేజీ ఫెలో కథ చాలా బావుటుంది. నేను కథనే బలంగా నమ్ముతాను. బలమైన కథ ఇది. నూతన దర్శకుడు ఫణి కృష్ణ చెప్పినట్లే చక్కగా తీశారు. ఆదికి సరిపడే కథ ఇది. ఆది లుక్ డిఫరెంట్ గా ఫ్రెష్ గా వుంటుంది. ఆది క్యారెక్టర్ చాలా క్రేజీగా కొత్తగా వుంటుంది. కథలో చాలా క్యూరియాసిటీ వుంటుంది. చాలా క్లీన్ సినిమా. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసి ఒక రెండున్నర గంటలు పాటు హాయిగా ఎంజాయ్ చేసే సినిమా క్రేజీ ఫెలో. కోవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన మారిందా ? చాలా మారింది. ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు. వరల్డ్ సినిమా చూస్తున్నారు. ఇంటర్ నేషనల్ కంటెంట్ దొరుకుతుంది. వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం మాకు సవాల్. ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్ కి వెళ్ళాలా ? ఓటీటీలో చూడాలా ? అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు ప్రేక్షకులని ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక నిర్మాతలకు ఒక సవాల్. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఇప్పటికీ సినిమా రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి కదా ? మొదట్లో శాటిలైట్,, ఇప్పుడు ఓటీటీ.. ఇలా రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. అయితే ఇందులో నిర్మాతకు మిగిలేది ఏమీ లేదు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక రోజు షూటింగ్ కి 3 లక్షలు ఖర్చు అయితే ఇప్పుడు 8 లక్షలు అవుతుంది. మార్కెట్ ని అర్ధం చేసుకుంటూ కథకు తగిన వనరులు సమకూర్చుకుని నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన భాద్యత నిర్మాతపైనే వుంటుంది. యూఎస్ నుండి షిఫ్ట్ అయిపోయాను. పూర్తి సమయం సినిమాలకి కేటాయించాను. గత మూడేళ్ళుగా ఓరేయ్ బుజ్జిగా, ఓదేల రైల్వే స్టేషన్..  ఇప్పుడు క్రేజీ ఫెలో చేశాం. స్పీడు పెంచుతూనే రిస్క్ ని బ్యాలన్స్ చేస్తేనే ఇండస్ట్రీలో వుండగలం. ఇప్పుడు ఇండస్ట్రీ చాలా ఆర్గనైజ్ద్, కార్పోరేట్ స్టయిల్ లో వుంది. నేను కూడా ఇలానే సినిమాలు చేయడానికే ఇష్టపడతాను. మీ నిర్మాణంలో మీకు తృప్తిని ఇచ్చిన చిత్రాలు ? కథ పరంగా అధినేత నాకు చాలా తృప్తిని ఇచ్చిన చిత్రం. ఏమైయింది ఈవేళ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మారుతి లాంటి దర్శకులు ఆ సినిమాతోనే స్ఫూర్తి పొంది సినిమాలు చేశామని చెబుతుంటారు. పంతం సినిమాలో ఇచ్చిన సందేశం కూడా నచ్చుతుంది. కమర్షియల్ గా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం రవితేజ బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ నిర్మాత అనే గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో ఇద్దరి కథానాయికలు గురించి ? దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ ఇద్దరూ చాలా చక్కగా చేశారు. మిర్నా మీనన్ కి ఇది తొలి తెలుగు సినిమా. ఆమె పాత్రలో మంచి సర్ ప్రైజ్ వుంటుంది. సంగీతం గురించి ? ఆర్ఆర్ ద్రువన్ అప్ కమిగింగ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఐదు పాటలు డిఫరెంట్ వేరియేషన్స్ లో చేశాడు. ఆర్ఆర్ ని కూడా చాలా బ్రిలియంట్ గా చేశాడు. మ్యూజిక్ విషయంలో తృప్తిగా వుంది. కొత్తగా చేయబోతున్న చిత్రాలు ? ప్రస్తుతం ఆయుష్ శర్మ తో ఒక హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేశాం. త్వరలోనే వివరాలు తెలియజేస్తాం. ఆల్ ది బెస్ట్ థాంక్స్

కేటీఆర్ కాలనీలో పాదయాత్ర చేసిన వెంకటేష్

కేటీఆర్ కాలనీలో పాదయాత్ర చేసిన వెంకటేష్ గౌడ్ 124 డివిజన్ పరిధిలోని కేటీఆర్ కాలనీలో డ్రైనేజీ మరియు చెత్త సమస్యలను బస్తి వాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా, కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి కేటీఆర్ నగర్లో…

కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆద్వ‌ర్యంలో అట్టహాసంగా జ‌రిగిన 67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022

కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆద్వ‌ర్యంలో అట్టహాసంగా జ‌రిగిన 67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022 అవార్డుల ప్ర‌ధానోత్స‌వ వేడుక‌ దక్షిణాది భాషలు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో అత్యుత్తమ కళాకారులను గౌరవిస్తూ  ఫిల్మ్‌ఫేర్ కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో కలిసి…

కొంపల్లిలో వరద నీటి సమస్యను అధికారులతో

కొంపల్లిలో వరద నీటి సమస్యను అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే… నిన్న కురిసిన అతి భారీ వర్షానికి కొంపల్లి నేషనల్ హైవేపై వరద నీరు ప్రవహించడంతో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించారు. రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు స్తభించి పోవడంతో…

అనాధ పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటా దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అనాధ పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటా దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ( ప్రభు ) అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి లో గల స్పందన అనాధాశ్రమం…

చౌటుప్పల్ రాజగోపాల్ రెడ్డి ప్రచారం

చౌటుప్పల్ మండలంలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం *సాక్షిత : ప్రచారంలో కోమటిరెడ్డి వెన్నంటే మాజీ ఎమ్మెల్యే, చౌటుప్పల్ మండల ఇంచార్జ్ కూన శ్రీశైలం గౌడ్ * చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట్, మల్కాపురం, కైతపురం, యెల్లాగిరి…

ప్లోరైడ్ భూతం నుండి విముక్తి

సాక్షిత : ప్లోరైడ్ భూతం నుండి విముక్తి కల్పించిన ఘనత TRS ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని…

పేద ప్రజలకు సైతం ఉపకరించే

సాక్షిత : పేద ప్రజలకు సైతం ఉపకరించే అధునాతన సదుపాయాల ఫంక్షన్ హాల్స్ ను సికింద్రాబాద్ లో నిర్మించామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట లోని బోయ బస్తీ కమ్యూనిటీ హాల్ లో అడ్డగుట్ట డివిజన్ కు…

దివాకర్ రావు సమక్షంలో

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి మరియు బీజేపీ పార్టీ నుండి టీఆర్ఎస్(BRS) లో పలువురు చేరిక*సాక్షిత : * దండేపల్లి మండలం లోని పాత మామిడిపల్లి గ్రామం,నెల్కివెంకటపూర్ గ్రామం నుంచిటిఆర్ఎస్(BRS) పార్టీ ,సీఎం కేసీఆర్,…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE