SAKSHITHA NEWS

Our government’s program for Gadapa Gadapa

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం బోడెపూడివారిపాలెం, మరియు కొండ్రముట్లపాలెం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి కి తిరుగుతూ, అర్హులైన ప్రజలకు వారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందిన సంక్షేమ పథకాలను, జరిగిన అభివృద్ధి ని వివరిస్తూ..

గ్రామంలోని ప్రతి ఇంటి గడప వద్దకు వెళ్లి వారికి ఇంకేమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * ఈ కార్యక్రమంలో వారితో పాటు అధికారులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS