ప్రభుత్వానికి ధైర్యం లేకే ప్రతిపక్షాలను అరెస్టు చేస్తున్నారు

Spread the love

ప్రభుత్వానికి ధైర్యం లేకే ప్రతిపక్షాలను అరెస్టు చేస్తున్నారు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

నేడు గండిమైసమ్మ లో డబల్ బెరూం ల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో ఉదయం 6 గంటలకే సీపీఐ నాయకులను అరెస్టు చేసి జగతగిరిగుట్ట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులకు డబల్ బెడ్రూంలను ఇచ్చి మంచి పని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు. అందరి దరఖాస్తులను పరిశీలంచకపోవడం,అందరికీ ఇస్తామని చెప్పి 25 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం లక్ష మందికే ఇవ్వడం,ఇచ్చిన వారిలో ఇండ్లు,ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారుండడం, అసలైన కార్మిక వర్గంగా చెప్పుకునే భవన నిర్మాణ కార్మికులకు, హమాలి కార్మికులకు, ఆటో డ్రైవర్లకు,జిహెచ్ఎంసి కార్మికులకు, వికలాంగులకు, వితంతువులకు రాకపోవడం లాంటి తప్పుల వల్లే నేడు ప్రభుత్వం కమ్యూనిస్టులను, కాంగ్రెస్ వారిని ముందస్తుగా అరెస్టు చెయ్యడం అప్రజాస్వామిక విధానమని అన్నారు.

అరెస్టుల వల్ల భయపడే పార్టీలు కాదని, అర్హులకు డబల్ బెడ్రూములైన లేక 60 గజాల ఖాళీ స్థలమైన ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని ఎక్కడ చూసిన పోరాటాలు సాగుతున్నాయని ప్రజాప్రతినిధులు మేకపోతు గాంబిర్యం ప్రదర్శిస్తున్నారే తప్ప ఎలాంటి ధైర్యం లేదన్నారు.

కేటీఆర్ కేవలం లక్ష డబల్ బెడ్రూం చూపిస్తూ కోట్ల ఓట్లు లాక్కుందాం అని అనుకుంటున్నారని అది కోడిని చూపి ఇదే చికెన్ తినండి అన్నట్లు ఉందని ప్రజలు తెలివివంతులని మోసం ఎప్పటికి కుదరదని అన్నారు.
కావున ప్రభుత్వం తమ ఇంటెలిజెన్స్ ద్వారా నిజమైన రిపోర్టు తెపించుకొని ప్రజలకు అందరికి డబల్ బెడ్రూంలను ఇవ్వలేమని క్షమాపణలు చెప్పి 60 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అరెస్టు అయ్యినవారిలో సీపీఐ నాయకులు ప్రభాకర్, శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page