మార్చి 17 న ఆన్ లైన్ లో 39 పోలీసు వాహనాల వేలం.
సాక్షిత కర్నూలు జిల్లా : జిల్లా పోలీసు విభాగానికి చెందిన కాలం చెల్లిన 39 పోలీసు వాహనాలను 15 లాట్లుగా విభజించి, మార్చి 17 న వేలం నిర్వహించనున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ పద్ధతి ద్వారా వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు.
https://konugolu.ap.gov.in అనే వెబ్ సైట్లో బిడ్డింగ్ వేయాల్సిందిగా సూచించారు. ఈ వాహనాలు కర్నూలు లోని (జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం) డిస్ట్రిక్ట్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో ఉన్నాయని, ఆసక్తి కలిగినవారు చూసుకోవచ్చన్నారు. ఆసక్తిగలవారు ఎమ్టివో ఆర్ఐ విఎస్.రమణ, సెల్ నెం.9121101053, రైటర్ సెల్ నెం. 9908628390 లను సంప్రదించాలని కోరారు.