ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి.

Spread the love

ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి.
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు.
సాక్షిత కర్నూలు జిల్లా

పరీక్షల కేంద్రాలలోకి విద్యార్థులు మరియు ఇన్విజిలేటర్లు కూడా పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు నిషేధించడంతో పాటు ఇంటర్మీడియేట్ మొదటి, రెండవ సంవత్సరపు పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హల్ లో ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ, ఇంటర్మీడియేట్ మొదటి, రెండవ సంవత్సరపు పరీక్షలు మార్చి 15వ తేది నుంచి మార్చి 29వ తేది వరకు ఉ.9.గం.ల నుండి మ.12గం.ల వరకు నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా, మార్చి 30వ తేది నుండి ఏప్రిల్ 4వ తేది వరకు జనరల్ ఫౌండేషన్ కోర్సులు మరియు బ్రిడ్జి కోర్సుల పరీక్షలు జరుగుతాయని తెలియచేసారు.

కర్నూలు జిల్లాలో ఉన్న 167 జూనియర్ కళాశాల నుండి మొదటి సంవత్సరం జనరల్-21,748, వొకేషనల్-1,862 మంది విద్యార్థులు మొత్తం-23,610, రెండవ సంవత్సర జనరల్-24,153, వొకేషనల్- 1,904 మంది విద్యార్థులు మొత్తం-26,057 మొదటి మరియు రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం-49,667 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని ఆర్ఐఓ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ పరీక్షల నిర్వహణకు గాను 73 పరీక్ష కేంద్రాలను గుర్తించడం జరిగిందని వాటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలు – 23, ఎయిడ్‌ జూనియర్ కళాశాలు – 06, ఏపీఆర్జేసీ – 01, మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలు – 06, ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలు – 37 జిల్లా కలెక్టర్ కు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహణకు గాను ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 12 సిట్టింగ్ స్క్వాడ్స్ కు నియమించారన్నారు. పరీక్ష కేంద్రాలలో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు లైవ్ స్ట్రీమింగ్ జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షలు జరుగుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాల పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆర్ఐఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రిక్ పరికరాలు అనుమతించకూడదన్నారు.

ఈ పరీక్షల నిర్వహణకు గాను జిల్లా స్థాయిలో ఒక హైపవర్ కమిటీ ఉంటుందని, అందులో జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా ఉంటారన్నారు. అదే విధంగా పరీక్షల సమయంలో విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా పరీక్షల మీద దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. పోలీస్ శాఖ వారు పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాలు తరలించేటప్పుడు భద్రత కల్పించడంతో పాటు నలుగురు ఏఎస్ఐ స్థాయి అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్ గా కేటాయించాలని ఆర్ఐఓ జిల్లా కలెక్టర్ ను కోరారు. అదే విధంగా, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు చుట్టు ప్రక్కల ఉన్న జిరాక్స్ షాపులను కూడా ముయించాలన్నారు. ఒక చీఫ్ సూపరింటెండెంట్ మాత్రమే విద్యా శాఖ వారు అందించిన కీప్యాడ్ మొబైల్ ను మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉండేలా చూడాలన్నారు. మున్సిపల్ సిబ్బంది పరీక్ష కేంద్రాల్లో పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు త్రాగునీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధమ చికిత్స నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించాలన్నారు.

విద్యుత్ శాఖ వారు పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేసేలా చూడాలన్నారు. ఏపీఎస్ఆర్టీసీ వారు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను సమయానికి చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు, విద్యార్థులు కూడా సరైన సమయంలో పరీక్ష కేంద్రానికి రావాలన్నారు. పరీక్ష అనంతరం రవాణా చేసే సమాధాన పత్రాలను నాణ్యత కలిగిన క్లాత్ తో సరైన రీతిలో కుట్టి రవాణా చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మరియు పోస్టల్ అధికారులను ఆదేశించారు. అనంతరం సంబంధిత శాఖల వారు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్ఐఓ గురువయ్య శెట్టి, డివిఈఓ జమీర్ భాష, డిఈఓ రంగా రెడ్డి, పోలీస్ శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖ, ట్రాన్స్కో, మున్సిపల్ శాఖ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page