మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్న ఎమ్మెల్యే వనమా

Spread the love


Once again showed his generosity: MLA Vanama

మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్న : ఎమ్మెల్యే వనమా


సాక్షిత : కొత్తగూడెం మున్సిపాలిటీ 26వ వార్డులో పేద దళిత వికలాంగుడికి దళిత బంధు 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన : ఎమ్మెల్యే వనమా

ఆ వికలాంగుడి కుటుంబం సంతోషంతో ఎమ్మెల్యే వనమా ని శల్వతో సన్మానించి, జన్మత వనమా కుటుంబానికి రుణపడి ఉంటామని అన్నారు

కొత్తగూడెం మున్సిపాలిటీ 26 వ వార్డ్ లో పేద దళిత వికలాంగుడికి దళిత బంధు 10:00 లక్షల రూపాయలు మంజూరు చేసి, వారి యొక్క వ్యాపారాన్ని ప్రారంభించి, వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆశీర్వదించిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు .*

ఈ సందర్భంగా పేద దళిత వికలాంగుడి కుటుంబం మాట్లాడుతూ మా ఆర్థిక అభివృద్ధికి సహకరించి, దళిత బంధు పథకాన్ని మాకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే వనమాకు జన్మత రుణపడి ఉంటామని, నన్ను గుర్తించి నాకు ఈ పథకం ఇచ్చినందుకు వనమా మేలును జీవితంలో మర్చిపోలేనని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, స్థానిక కౌన్సిలర్ అంబుల వేణు, కోలాపురి ధర్మరాజు, వేముల ప్రసాద్, బండి నరసింహా మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page