SAKSHITHA NEWS

వాహనదారులు ఇబ్బందులు

డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం లేదా

మల్దకల్ మండల కేంద్రంలోని డ్రైనేజీ మురికినీరు అంతా గద్వాల్ ఐజ ఆర్ అండ్ బి రోడ్డుపై మురికి నీరు పారుతుంది. రోడ్డుపై వచ్చే వాహన చోదకులు మురికి కంపు వాసనతో వెదజల్లడం వల్ల అనారోగ్యాలకు దారితీస్తుంది. పేరుకే మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మురికి వాసనతో వచ్చి పోయే వాహనాలులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇటీవల గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కాలం ముగియడంతో గ్రామపంచాయతీకి ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి ఉన్నప్పటికీ వారు కూడా చూసి చూడనట్లు ఉన్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తున్న అదికారులు మాత్రం శాశ్వత పరిష్కారo చేయటంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డుపై మురికి నీరును అరికట్టి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.


SAKSHITHA NEWS