SAKSHITHA NEWS

మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు ప్రజా పాలన వార్డు సభలో పాల్గొన్న మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..!

సాక్షిత ::మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ,మేడ్చల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాధాకృష్ణ రెడ్డి,23వ వార్డు ఆఫీసర్ శ్రీనివాస్ తో పాటు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియన్నారు.రాష్ట్రంలో 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఆరు లక్షల రేషన్ కార్డులు కట్ చేసి 40 వేల రేషన్ కార్డులు ఇచ్చారన్నారు.మన ప్రజా ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు,అప్పులను సరిజేసుకుంటూ అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామన్నారు.కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నామన్నారు.అదేవిధంగా గత సంవత్సర కాలంలో 20 రోజులు ఉపాధి హామీ పని చేసిన భూమిలేని నిరుపేదలు అందరికీ సంవత్సరానికి 12 వేల రూపాయలు,ఇందిరమ్మ ఇల్లు,ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు.గుట్టలకు కొండలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కాకుండా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సంవత్సరానికి ఎకరానికి రూ.12000/- ఇవ్వబోతున్నామని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలియజేస్తూ మొదటి దశలో సొంత స్థలం కలిగి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలతో కట్టిస్తామన్నరు.ఈ నాలుగు రోజులపాటు జరిగే ప్రజా పాలన వార్డు,గ్రామసభలలో ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డుకి,ఇందిరమ్మ ఇండ్లకి దరఖాస్తు పెట్టుకుంటే వాటిని కూడా పరిశీలించి గుర్తిస్తామన్నారు.ఈ కార్యక్రమాలన్నీ నిరంతరంగా జరుగుతాయి,ఈ జనవరి 26 కు కొంత మందికి మిగతా వారికి దశలవారీగా ఈ కార్యక్రమాలన్నీ అమలు చేయబోతున్నాం.

ఎలక్షన్లో మాట ఇచ్చినట్టు 2 లక్షల వరకు రుణమాఫీని 22,000 కోట్లతో చేశామన్నారు.200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అర్హులందరికీ అందిస్తున్నామని,మహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి ప్రతినెల 300 కోట్లు కడుతున్నాం.గ్యాస్ సిలిండర్లు 500లకే ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ తోటకూర వజ్రేష్(జంగయ్య),మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మ రెడ్డి,మేడ్చల్ మున్సిపల్ కమీషనర్ బట్టు నాగిరెడ్డి సహయ సహకారాలతో ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నానన్నారు.23వ వార్డు పరిధిలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం కృషిచేసినట్లు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాధాకృష్ణ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి,మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు సింగిరెడ్డి బాగిరెడ్డి,వార్డు నాయకులు కౌడే భిక్షపతి కురుమ,మహమ్మద్ ఉమ్మర్,నరేందర్,ఉద్దెమర్రి రాజు ముదిరాజ్,కౌడే శ్రీశైలం కురుమ,మొలంగిరి విజయ్ కుమార్ చారి,పెంజర్ల భాస్కర్ యాదవ్,కౌడే నాగేందర్ కురుమ,మహమ్మద్ వాహెద్,కౌడే వెంకటేష్ కురుమ,రవి,ప్రసాద్,వెంకట్,సాయి వార్డు ఆఫీసర్లు శ్రీనివాస్,రాజబాబు,చత్రపతి,భార్గవ్,ఆర్ఫీలు అనిత,బాలమణి మేడ్చల్ మున్సిపల్ సిబ్బంది నర్సింగ్ రావు,గీత మేడ్చల్ పట్టణ పుర ప్రముఖులు,యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.