
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఐడిబిఐ బ్యాంక్ వారి సౌజన్యంతో విద్యార్థులకు చైర్లు,కంప్యూటర్ టేబుల్స్, అంప్లిఫైర్, స్పీకర్ సెట్, అల్మరాలు, వంట సామానులు పంపిణీ చేయు కార్యక్రమంలో ఐడిబిఐ బ్యాంక్ RH సందీప్ పట్నాయక్, కూకట్పల్లి DGM మురళీధర్ తో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .
ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఐడిబిఐ బ్యాంక్ వారు మంచి మనసుతో, మానవతా దృక్పథంతో విద్యార్థులకు మరియు స్కూల్ సిబ్బందికి అవసరమైన చైర్లు,కంప్యూటర్ టేబుల్స్, అంప్లిఫైర్, స్పీకర్ సెట్, అల్మరాలు, వంట సామానులు అందించారు అని, అలానే విద్యార్థులు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం,అద్భుతమైన స్కూల్ ప్రాంగణం, మంచి అనుభవం ఉన్న బోధనా సిబ్బంది మరియు కార్పొరేట్ స్కూల్స్ లో కూడా లేని వసతులు, సౌకర్యాలూ కలిగి వుండటం విద్యార్థుల అదృష్టం అని, ఈ సదుపాయాలు ఉపయోగించుకొని మంచి మార్కులతో స్కూల్ కు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలతో ఉన్నత స్థాయిలో వుండాలని కోరుకుంటున్నట్లు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐడిబిఐ బ్యాంక్ ఉన్నతాధికారులు, సిబ్బంది, స్కూల్ ప్రిన్సిపాల్, ఇన్చార్జి, బోధనా సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
