SAKSHITHA NEWS

On the second day in Ramasagaram, ‘Gadapa Gadakuku Mana Govt.’

రామసాగరంలో రెండవ రోజు ‘గడప గడపకు మన ప్రభుత్వం’

-పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

సాక్షిత : ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలం రామసాగరం గ్రామంలో రెండవరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది.

ముందుగా గ్రామస్తులు, వైస్సార్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను మాజీ ఎమ్మెల్యే వివరించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు,వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS