నూజెoడ్ల మండలం గ్రామ పేద రైతుల చిరకాల కళ నెరవేరనుంది

Spread the love

Nujeodla Mandal v. Appapuram Village The long-standing art of poor farmers will be fulfilled

శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చొరవతో నూజెoడ్ల మండలం v.అప్పపురం గ్రామ పేద రైతుల చిరకాల కళ నెరవేరనుంది.


సాక్షిత : గ్రామంలో సుమారు 2,067 ఎకరాల ఈనాం భూమికి హక్కు కల్పించేందుకు మొదటి అడుగు పడినది

ఈ సందర్భంగా ఈ ఈనాం భూముల సర్వే గురించి ఈ విధంగా వివరించారు.

మొదట సర్వేలో భాగంగా గ్రామానికి చెందిన హద్దులని నిర్ణయిoచడం జరుగుతుంది. అనంతరం, ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఆ ప్రభుత్వ భూమిని నిర్ణయిoచడం జరుగుతుంది.తరువాత రైతులు సాగుచేసుకునే భూమిని సర్వే చేయడానికి ముందుగా ప్రస్తుతం ఆ భూమిని సాగుచేసుకునే వారికి ఫారం-1 జారీ చేసి రైతుల వద్ద వారు సాగుచేసుకునే భూమికి సంబంధించి ఏదైనా పత్రం ఉంటే అవి సంబంధిత సర్వేయర్లకు ఇవ్వాలి, వారి హద్దులను సంబంధిత అధికారులకి చూపించగలగాలి.

తరువాత రైతులు కేటాయించిన భూమికి సంబందించిన విస్తీర్ణాన్ని, హద్దులను ప్రజలందరికి తెలిసే విధంగా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఈ హద్దులపై కాని విస్తీర్ణం పై కాని ఏదైనా అభ్యంతరాలు ఉంటే అధికారులు నిర్ణయిoచిన సమయంలోపూ అధికారుల దృష్టికి తీసుకురావాలి.

ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించి అనంతరం రైతుల హద్దులను నిర్ణయిoచడం జరుగుతుంది. తరువాత ప్రతి రైతుకి ఒక సర్వే నెంబర్ ని కేటాయించడం జరుగుతుంది. తరువాత ఈ సర్వేకి సంబంధించి FLR తయారు చేసి తదనంతరం ROR తయారుచేయడం జరుగుతుంది.

ఈ కార్యక్రమం పూర్తి చేసిన తరువాత ఈ విషయo పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే వెల్లడించాలని ప్రజలకి, బహిరంగా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అభ్యంతరాలు వచ్చినట్లేతే వాటిపై చర్చ జరిపి వాటిని పరిష్కరించి అనంతరం RSR లో నమోదు చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియతో రైతుల భూములకి సంబంధించి స్థలం విస్తీర్ణం, హద్దులు పూర్తిస్థాయిలో నిర్ణయిoచడం పూర్తి అవుతుంది.

తరువాత రైతులకి పట్టాలు కేటాయించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం పంపి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పిదప రైతులకి పట్టాలు పంచడం జరుగుతుందని, తరువాత ఈ పట్టాలను వెబ్ ల్యాండ్ లో ఏక్కించుకునేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదికను పంపుతాము. ప్రభుత్వం అనుమతి పొందిన వెంటనే ఈ భూమిని పట్టాలు పొందిన రైతుల పేరు వెబ్ ల్యాండ్ లో ఎక్కించడం జరుగుతుంది

. ఈ కార్యక్రమం అంత సులభంగా జరిగే పని కాకపోయిన పట్టు వదలకుండా ఈ కార్యమాన్ని పూర్తి చేసి రైతులకి వారి భూమిపై శాశ్వత హక్కు కల్పిస్తామని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు రైతులకి హామీ ఇచ్చారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఇంకా పలు గ్రామాలలో ఈ విధంగా ఈనాం, అగ్రహారం భూములు ఉన్నాయి, వాటిని కూడా రైతులకి హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ మా తర-తరాల నుండి ఈ ఈనాం భూముల వలన అనేక ఇబ్బందులు పడ్డామని కానీ మీ చొరవతో మాకు మా భూమిపై హక్కు కలుగుతుందనే ఆశ పెరుగుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు.

Related Posts

You cannot copy content of this page