ఎన్టిటిపిఎస్ పొల్యూషన్ పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తనిఖీలు

Spread the love

ఎన్టీఆర్ జిల్లా

ఎన్టిటిపిఎస్ పొల్యూషన్ పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తనిఖీలు

కంట్రోల్ బోర్డు బృందం పరికరాలతో శాంపిల్స్ సేకరణ

ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన ఎన్టిటిపిఎస్ అధికారులు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎన్ టి టి పి ఎస్

ఇబ్రహీంపట్నం మార్చి 28

నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ పొల్యూషన్ కాలుష్యం కారణంగా కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షాబుఖారి దర్గాకు,మసీదుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కు ఫిర్యాదు………

ఫిర్యాదుతో మంగళవారం నాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బృందం….కాలుష్య శాంపిల్ తీసే పరికరాలతో 2 గంటల పాటు అబ్జర్వేషన్ చేశారు…….. ఎనలిస్ట్ విజయ సారథి శాంపిల్ తీసి విజయవాడ లేబరేటరీ కి పంపారు…………..

ముందస్తు సమాచారంతో అప్రమైన ఎన్ టి టి పి ఎస్ యాజమాన్యం బొగ్గు డంపింగ్ చేసే మిషన్లను ఆపివేసి, పరిసర ప్రాంతాల్లో వాటరింగ్ చేయించి నియంత్రణ చర్యలు చేపట్టారు….

NTTPS సంస్థ స్థాపించిన నాటి నుండి 40 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా మసీదు రోడ్డు, దర్గా ప్రాంతంలో వాటరింగ్ చేయించారు….. వాటర్ ట్యాంకర్ తో తడపడం అనేది…… మొట్ట మొదటిసారిగా చూసి దర్గాకు వచ్చే భక్తులు స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపరచడం….

ఎన్టిటిపి వాహనంలో వాహనంలోనే దర్గా ప్రాంతానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బృందం రావటం పలు అనుమానాలకు తావిస్తోంది….

ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోగాల పాలవుతున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు ఫిర్యాదులు చేస్తే ఈరోజు వారు చేసినటువంటి తతంగం ప్రజలు ప్రాణాలు ఏమైనా పర్వాలేదు NTTPS నుంచి మాకు మేలు జరిగితే చాలు అనే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

దర్గాకి వచ్చే భక్తులు పవిత్ర రంజాన్ మాసంలో మసీదుకు వచ్చే ఉపవాసం ఉన్నవారికి ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనీసం కింద కూర్చొని పదినిమిషాలు ప్రార్థన చేసుకుంటానికి కూడా వీలు లేని విధంగా తెల్ల బట్టలతో వచ్చినటువంటి వారు నల్లగా మారిపోయి మసీదు దర్గా వచ్చామా లేదా కూలి పనికి వెళ్ళామా కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని NTTPS సంస్థకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవు.

కనీసం దర్గా, మసీదు ప్రాంతంలో ఒక చెట్టు కూడా వేసినటువంటి దాఖలాలు లేవు ఆ ప్రాంతం అంతా శుభ్రం కు వర్కర్స్ ని పెట్టమని చెప్పడం, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు…… రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని దర్గాకు మసీదుకు వచ్చే ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాం…… కమిటీ సెక్రటరీ న్యాయవాది మసూద్ అలీ జిన్నా, దర్గా ముతవల్లి షాజహా,
బాబు బాజీ సయ్యద్ ఖాజా,అల్తాఫ్ రజా తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page