జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి…

Spread the love

National Unity Diamond Jubilee celebrations should be successful…

జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి…

16న.. 15వేల మందితో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుండి కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ…

జాతీయ గీతాలాపన.. పాటలతో ఆకట్టుకొనున్న ప్రముఖ సింగర్ లు…

ట్రాఫిక్ తదితర ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు…

అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సూచనలు…
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈ వేడుకల ఏర్పాట్లపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు.

16వ తేదీన సుమారు 15 వేల మందితో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ముఖ్యంగా ట్రాఫిక్ వంటి ఇబ్బందులు తలెత్తకుండా జిహెచ్ఎంసి, పోలీస్ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. 16వ తేదీన ఉదయం 9 గంటలకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుండి 15 వేల మందితో జాతీయ జెండాలతో కోలాహలంగా పెద్ద ఎత్తున ర్యాలీగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్ పాయింట్ కు చేరుకొని మొదటగా జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమం ప్రారంభించనున్నారు.

ప్రముఖ సింగర్ లు పాటలతో ఆకట్టుకొనున్నారు. అనంతరం భోజనం చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, సమైక్య లీడర్లు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, నాయకులు, అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ మమత, డిసిపి సందీప్, మేడ్చల్ జిల్లా పరిషత్ సీఈఓ దేవ సహాయం, కమిషనర్ భోగిష్వర్లు, ఎంఈఓ ఆంజనేయులు, ఎమ్మార్వోలు భూపాల్, సరిత, డిసిలు మంగతాయారు, ప్రశాంతి, ఏసీపీలు గంగారాం, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఈ చెన్నారెడ్డి, ఈఈలు కృష్ణ చైతన్య, గోవర్ధన్, కొంపల్లి చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్లు గంగయ్య నాయక్, టీ.పద్మారావు, నిజాంపేట్ డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, రంగారావు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page