Telangana National Unity Day

Spread the love
Telangana National Unity Day

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని” పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ .

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ తో, డి. ఎస్పీ ఎన్. సి హెచ్ రంగ స్వామి తో, సాయుధ దళ డి. ఎస్పీ ఇమ్మనియోల్ తో కలసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా కార్యాలయ అధికారులతో, సిబ్బంది తో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారత దేశములో అందరికి ఆగస్ట్15న స్వతంత్రం వస్తే నిజాం ప్రాంతంగా పిలువబడుతున్న మన హైదరాబాద్ ప్రాంతానికి స్వతంత్ర సమరయోధులు పోరాటం తో సైనిక చర్యను జరిపి 1948 సెప్టెంబర్17 న భారత యూనియన్ లో కలిపి ప్రాంతానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ను కల్పించారని అన్నారు.

ఆ క్రమం లో దేశంలో అన్ని సంస్థనాలు భారత యూనియన్ లో కలిసినప్పటికి నిజాం రాజు కలవడానికి ఇష్టం లేకపోవడం, అలాగే అప్పట్లో ఖాసీం రజ్వి ప్రజల పై జరిపే హింస పెరిగిపోవడం తో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, కొమురం బీమ్ వంటి వారు పోరాటాలు సాగించేవారని వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని అప్పటి ప్రధాని నెహ్రు, ఉపప్రదాని హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చోరువతో జనరల్ చౌదరి అధ్వర్యంలో సైనిక చర్య జరిపి నిజాం ప్రాంతాన్ని భారత్ లో కలపడం జరిగిందని, ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. చరిత్రను మనం మరవకూడదని, చరిత్రను తెలుసుకోవాలని తెలియజేస్తూ సిబ్బందికి అందరికీ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏ. ఓ సతీష్ , ఎస్బి ఇన్స్పెక్టర్ శివ కుమార్ , గద్వాల్ సి. ఐ చంద్రశేఖర్ ,కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page