ఘనంగా “ముఖచిత్రం” ట్రైలర్ విడుదల కార్యక్రమం, ఈ నెల 9న సినిమా విడుదల

SAKSHITHA NEWS

Mukhachitram” trailer release event, movie release on 9th of this month

image 8

ఘనంగా “ముఖచిత్రం” ట్రైలర్ విడుదల కార్యక్రమం, ఈ నెల 9న సినిమా విడుదల

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం”. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో విడుదల
చేశారు. ఈ సందర్భంగా

దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ…నేను తప్ప కలర్ ఫొటో చిత్రానికి పనిచేసిన వాళ్లందరూ ఈ సినిమాలో ఉన్నారు. సందీప్ రాజ్ మరోసారి ఓ క్లాసిక్ మూవీ చేశాడని ఆశిస్తున్నా. దర్శకుడు గంగాధర్ కు ఆల్ ద బెస్ట్. అన్నారు.

చిత్ర దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ…ముఖచిత్రం చిన్న చిత్రంగా మొదలైంది కానీ విశ్వక్ సేన్ మా టీమ్ లోకి వచ్చాక పెద్ద సినిమా అయ్యింది. టీజర్ కట్ చేసి ఆయనకు చూపించినప్పుడు నా పాత్ర ఏంటి అని కూడా అడగకుండా ఈ సినిమా
నేను చేస్తాను మీరు  షూటింగ్ డేట్ ఫిక్స్ చేసుకోండి అన్నారు. ఒక చిన్న సినిమాకు సపోర్ట్ చేసిన ఆయనకు థాంక్స్. ఈ క్యారెక్టర్ ఆయన ఎందుకు చేశాడు అనేది రేపు థియేటర్లలో చూసినప్పుడు అర్థమవుతుంది. అన్నారు.

సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ…ఇవాళ మాకు స్పెషల్ డే. ఈ రోజు కోసం రెండు మూడేళ్లుగా వేచి చూస్తున్నాం. సినిమా కోసం ప్రతి డిపార్ట్ మెంట్ పోటీ పడి పనిచేశాం. మా వర్క్ మరి కొద్ది రోజుల్లోనే మీకు తెలుస్తుంది. ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. అన్నారు.

హీరోయిన్ అయేషా ఖాన్ మాట్లాడుతూ..ఈ చిత్రంలో మాయా అనే పాత్రలో నటించాను. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థాంక్స్. ముఖచిత్రం సినిమాను థియేటర్లలో చూడండి ఎంజాయ్ చేస్తారు. అని చెప్పింది.

హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ…అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రాన్ని చేశాం. మా ట్రైలర్ ను ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. మంచి ఎమోషనల్ మూవీ చేశాం. మీ హార్ట్ కు టచ్ అయ్యేలా ఉంటుంది. అని చెప్పింది

వికాస్ వశిష్ట మాట్లాడుతూ…మా సినిమాకు బ్యాక్ బోన్ గా నిలబడిన ప్రొడ్యూసర్స్ కు థాంక్స్. నేను ఈ క్యారెక్టర్ చేయగలనని నమ్మిన దర్శకుడికి థాంక్స్. విశ్వక్ సేన్ రావడంతో మా సినిమా మరింత బిగ్ స్పాన్ లోకి వెళ్లింది. కాల భైరవ సంగీతం ఆకర్షణగా నిలుస్తుంది. అన్నారు.

సందీప్ రాజ్ మాట్లాడుతూ…ఈ సినిమాను పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. సంగీత దర్శకుడు కాలభైరవ లేకుంటే నేను దర్శకుడినే అయ్యేవాడిని కాదు. అతను నాకు బిగ్ సపోర్ట్. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ చేశాడు. ఒక మంచి సినిమా
ఇది. మీ అందరి సపోర్ట్ కావాలి. విశ్వక్ సేన్ గురించి మాట్లాడటం మొదలుపెడితే సినిమాలో అతని రన్ టైమ్ కన్నా ఎక్కువ సేపు మాట్లాడాలి. మూవీలో పార్ట్ అయిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. అన్నారు.

ఎస్కేఎన్ మాట్లాడుతూ…అనేక లేయర్స్ ఉన్న మల్టీ జానర్ మూవీ ఇది. కథ ఇలా ఉంటుందేమో అనుకునేలోపు మరో టర్న్ తీసుకుంటుంది. ప్రేక్షకుల ఊహకు అందకుండా సాగుతుంది. ఇలాంటి థ్రిల్లర్స్ ను ఇప్పుడు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఒక డిఫరెంట్ మూవీగా ఆకట్టుకుంటుంది. అన్నారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ….మంచి వాయిస్ ఉన్న క్యారెక్టర్ ను ఈ సినిమాలో చేశాను. ముఖ చిత్రం షూటింగ్ చేస్తున్న రెండు రోజులు ఒక వైబ్రేషన్ లో ఉండిపోయాను. మూవీ కంటెంట్ కొంత చూసినప్పుడు ఈ చిత్రంలో పార్ట్ అవ్వాలి అనిపించింది. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ప్రొడ్యూసర్ గా ఎలాంటి కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. ఇప్పుడు దమ్కీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా మరోసారి ఆ కష్టాలు తెలిసొచ్చాయి. ఈ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.

నటీనటులు – వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్

సాంకేతిక నిపుణులు – సంగీతం – కాల భైరవ, ఎడిటింగ్ – పవన్ కళ్యాణ్,
సమర్పణ – ఎస్ కే ఎన్,
నిర్మాతలు – ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల,
కథ స్క్రీన్ ప్లే,మాటలు – సందీప్ రాజ్,
దర్శకత్వం – గంగాధర్


SAKSHITHA NEWS

SAKSHITHA NEWS

Related Posts

movie actor సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSmovie actor లావణ్య కేసులో హీరో రాజ్‌తరుణ్‌ను ఏ-1గా చేర్చిన పోలీసులు.ఏ-2గా మాల్వి మల్హోత్రా.. ఏ-3గా మయాంక్‌ మల్హోత్రా. 2010లో రాజ్‌తరుణ్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు. 2014లో నన్ను పెళ్లి చేసుకున్నాడు. రాజ్ తరుణ్‌ను మా కుటుంబం అన్ని విధాలుగా…


SAKSHITHA NEWS

years 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSyears 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.థడ్…థడ్…అని తలుపు చప్పుడు. years…


SAKSHITHA NEWS

You Missed

CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 21 views
CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

SOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవ

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 28 views
SOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవ

SARPANCH మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 25 views
SARPANCH మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్

KARNATAKA కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 25 views
KARNATAKA కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

KONDAKAL కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 26 views
KONDAKAL కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం

CYBER సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్న 3.4 లక్షలు గంట వ్యవధిలో

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 27 views
CYBER సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్న 3.4 లక్షలు గంట వ్యవధిలో

You cannot copy content of this page