సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ టీజర్

Spread the love

Aadi Sai Kumar’s ‘Top Gear’ teaser by successful director Maruti

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ టీజర్

వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు యంగ్ హీరో ఆది సాయి కుమార్. అలాంటి ఆది సాయి కుమార్ ఇప్పుడు టాప్ గేర్ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు యాక్షన్ సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకోగా ఇప్పుడు ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్  బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో  K. V. శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

టాప్ గేర్ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా సిధ్ శ్రీరామ్ పాడిన వెన్నెల పాట ఇలా అన్నింటిపైనా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో సినిమా మీద ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ ఏర్పడింది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టీజర్‌ను హిట్ చిత్రాల దర్శకుడు మారుతి డిసెంబర్ 3న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆది సాయి కుమార్ గన్ను పట్టుకుని ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. 

ఎన్నో హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన సాయి శ్రీరామ్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ఈ సినిమాకు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం హైలెట్ అవ్వనుంది. 

ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన.. రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాకథనాలతో రాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించబోతుంది. 

నటీనటులు 

ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్  తదితరులు  

టెక్నీషియన్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.శశికాంత్ 

సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్ 

మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్ 

ఎడిటర్: ప్రవీణ్ పూడి 

ఆర్ట్: రామాంజనేయులు  

కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి   

ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డి  

బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ 

ప్రెజెంట్స్: ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్

పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని


Spread the love

Related Posts

You cannot copy content of this page

virupaksha -వీరుపాక్ష SAKSHITHA NEWS LAILA – లైలా ANANYA RAJ – అనన్య రాజ్ RAJISHA VIJAYAN – రజిష విజయన్