“రిపీట్” మూవీ ఓ సరికొత్త థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది – హీరో ననీన్ చంద్ర

Spread the love

Repeat” movie is an impressive new thriller – hero Naneen Chandra

“రిపీట్” మూవీ ఓ సరికొత్త థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది – హీరో ననీన్ చంద్ర

హీరో నవీన్ చంద్ర నటించిన కొత్త సినిమా రిపీట్. మధుబాల కీలక పాత్రలో నటిస్తోంది. సత్యం రాజేష్, మైమ్ గోపి, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పీజీ ముత్తయ్య, విజయ్ పాండే నిర్మించిన ఈ చిత్రానికి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. గురువారం నుంచి రిపీట్ మూవీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
అవుతోంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపారు హీరో నవీన్ చంద్ర

– ఈ సినిమాను డెజావు పేరుతో తమిళంలో రూపొందించారు. దాన్నుంచి తెలుగులోకి రిపీట్ మూవీగా చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. గురువారం నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూస్తున్న వాళ్లు నాకు రాత్రి నుంచే స్క్రీన్ షాట్స్ పంపుతున్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గా ఉందని చెబుతున్నారు.

– ఈ సినిమాలో విక్రమ్ అనే క్యారెక్టర్ లో నటించాను. ఒక మూడ్ లో సెటిల్డ్ గా పర్మార్మ్ చేయాల్సిన క్యారెక్టర్ ఇది.  ఇలాంటి కథల్లో నటించేప్పుడు ఏకబిగిన షూటింగ్ చేసేయాలి. కొద్ది రోజులు మరో సినిమాకు పనిచేసి ఇక్కడికొస్తే ఆ ఫీల్ ఉండదు. అందుకే డే అండ్ నైట్ షూటింగ్ చేసి ఈ సినిమాను కంప్లీట్ చేశాం

– రిపీట్ మూవీలో మధుబాల గారితో కలిసి పనిచేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. నేను ఆవిడకు అభిమానిని. ఒక ఫ్యాన్ బాయ్ లాగా ఆమెతో కలిసి నటించాను. నవీన్ జీ అని పిలిచేది. నేను రాత్రిళ్లు షూటింగ్ చేయడం చూసి ఆమె ఇన్స్ పైర్ అయి తనూ రెండు రోజులు నైట్ షూట్స్ చేసింది. కెరీర్ బిగినింగ్ లో ఇలా రెస్ట్ లేకుండా షూటింగ్స్ చేశామని, మల్లీ ఈ సినిమాకు అలా పనిచేశామని ఆమె చెప్పింది. అందరితో చాలా గౌరవంగా, సరదాగా ఉంటారు మధుబాల.

– ఈ సినిమా తెలుగు వెర్షన్ చేస్తున్నప్పుడు నా సీన్స్, డైలాగ్స్ తెలుగులో షూట్ చేశాం. సత్యం రాజేష్ కీ రోల్ చేశాడు. మా దర్శకుడు చాలా సింపుల్. ఈ కథకు ఉన్నంత బడ్జెట్ లో కాంపాక్ట్ గా రూపొందించాడు. నేను, డైరెక్టర్, కెమెరామెన్ కలిసి మంచి అండర్ స్టాండింగ్ తో వర్క్ చేశాం.

– డిస్నీఫ్లస్ హాట్ స్టార్ లో నా మూవీస్, వెబ్ సిరీస్ లు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. హాట్ స్టార్ చూసేవాళ్లంతా నా మూవీస్ ఫాలో అవుతున్నారు. ఇటీవల పరంపర రిలీజైంది. దాంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది.

– ప్రస్తుతం వీర సింహా రెడ్డి, రామ్ చరణ్, శంకర్ చిత్రాలతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఓటీటీ, మూవీ ఏదైనా నటుడిగా బాగా పర్మార్మ్ చేయడమే నా బాధ్యత.


Spread the love

Related Posts

You cannot copy content of this page

virupaksha -వీరుపాక్ష SAKSHITHA NEWS LAILA – లైలా ANANYA RAJ – అనన్య రాజ్ RAJISHA VIJAYAN – రజిష విజయన్