కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్

Spread the love

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపిపి కొలను సునీత-వెంకటేష్ గౌడ్ స్థానిక సర్పంచ్ బోయపల్లి వాణి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సునీత వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మ కంగా తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల కంటి పరీక్షల కోసం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని అమలుచేసి కంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తున్నారని, పేదప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనునిత్యం పరితపించే ముఖ్యమంత్రి ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నందున కంటి సమస్యలు ఉన్న వారందరూ శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కంటి చూపుకు సరిపోయే రీడింగ్ అద్దాలను అప్పటి కప్పుడే ఇవ్వడం జరుగు తుందన్నారు. ప్రీస్క్రిప్షన్ అద్దాలను కూడా అంద చేయడం జరుగుతుందని అన్నారు. పేద ప్రజలు అందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఉప్పరబోయన అంజమ్మ స్వామి, చిట్యాల మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి,
వైద్యాధికారి డా.యు. నరసింహ, కంటి వెలుగు వైద్య నిపుణురాలు డా.లక్ష్మి, ఆప్తమాలజిస్ట్ ప్రశాంతి,
వార్డు సభ్యులు వెంకన్న,
ఏఎన్ఎం సరస్వతి ఆశా వర్కర్లు సంతోష, మున్ని, సునీత నాయకులు జగన్నాధం, మరియు కంటి వెలుగు సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page