సిఎం కప్ టోర్నమెంట్ ని ప్రారంభించిన ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్

Spread the love

సిఎం కప్ టోర్నమెంట్ ని ప్రారంభించిన ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్

చిట్యాల సాక్షిత ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడా పోటీలను పెద్దకాపర్తి జెడ్పి హైస్కూల్లో ముఖ్య అతిథులుగా ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి 10సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన దశాబ్ది ఉత్సవాలలో భాగం గా రాష్ట్రస్థాయి చీఫ్ మినిస్టర్ కప్ యువజన క్రీడా పోటీల్లో మండలంలోని పలు గ్రామాల యువత పాల్గొని విజయంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున పలు గ్రామాలలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి యువత లో వున్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసి వారిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. చిట్యాల మండల స్థాయి ఆటల పోటీలను జడ్పీ హైస్కూల్ పెద్దకాపర్తిలో వాలీబాల్, కబడ్డీ, ఖో,రన్నింగ్ మొదలైన క్రీడా అంశాలలో ఈ నెల 15, 16, 17 తేదీలలో మూడు రోజులు పాటు నిర్వహించబడతాయిని నిర్వాహకులు తెలియ చేశారు.
ఇక్కడ గెలుపొందిన టీం లను జిల్లా స్థాయి అదే విధంగా రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని గెలుపొందిన జట్టులకు బహుమతి ప్రదానం వుంటుందని పిఈటి లు రవీందర్, బ్రహ్మయ్య లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లాజర్, చిట్యాల మున్సిపల్ కమిషనర్ మందడి రామదుర్గా రెడ్డి, చిట్యాల ఎస్ఐ నకిరేకంటి ధర్మ, మండల పంచాయితీ అధికారి పద్మ, ఆరెగూడెం సర్పంచ్ ఆరూరి లాలమ్మ స్వామి, పలు గ్రామాల పంచాయితీ కార్యదర్శులు, పిఈటీలు, యువతీ యువకులు, క్రీడా కారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page