SAKSHITHA NEWS

MP Vadiraju for study tour of Members of Parliament

image 63

పార్లమెంట్ సభ్యుల స్టడీ టూర్ కు ఎంపీ వద్దిరాజు

సాక్షిత ఖమ్మం:

పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుని హోదాలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం స్టడీ టూర్ కు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి చెన్నై, గోవాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రమేష్ బిధూరి నేతృత్వంలో సభ్యులు ఈ నెల 17 నుంచి వారం రోజుల పాటు అధ్యయన యాత్ర కు బయలుదేరి వెళ్లారు. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఉండటం చేత ఎంపీ రవిచంద్ర తొలి మూడు రోజులు యాత్ర లో పాల్గొన లేకపోయారు. శుక్రవారం నుంచి కొనసాగే యాత్రలో పాల్గొనడానికి ఆయన చెన్నై వెళ్లారు.

స్టడీ టూర్ షెడ్యూల్ ఇదీ..

దక్షిణాది రాష్ట్రాల్లో పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తుల ధరలు, మార్కెటింగ్, సరఫరా తదితర అంశాలపై అక్కడి నిపుణులతో చెన్నై లో సమీక్ష నిర్వహిస్తారు. తదుపరి మానవ వనరుల విధానం పై జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి గోవా చేరుకుని ఆయిల్ రిఫైనరీపై సమీక్షిస్తారు. అనంతరం అక్కడి ప్రఖ్యాత ఐ పీ యస్ హెచ్ ఈ ఏం శిక్షణా కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో చమురు సంస్థల స్థాపనలో తీసుకోవాల్సిన భద్రతా, రక్షణా చర్యలపై సంబంధిత నిపుణులతో చర్చిస్తారు.


SAKSHITHA NEWS