మోడీ పర్యటన విజయవంతం చేయాలి

Spread the love

Modi’s visit should be successful

మోడీ పర్యటన విజయవంతం చేయాలి


షాద్ నగర్ మీడియా సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి
తెలంగాణకు మోడీ వస్తే టిఆర్ఎస్ పార్టీకి ఎందుకంత భయం

రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

షాద్ నగర్: తెలంగాణలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీని టిఆర్ఎస్ పార్టీ డైరెక్షన్ లో వామపక్ష పార్టీలు అడ్డుకునేందుకు పిలుపునిస్తున్నాయని ఇది దురదృష్టకరమైన చర్య అంటూ బిజెపి మండిపడింది. మోడీని అడ్డుకుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇతర ప్రజా ప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వబోమని బిజెపి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఏర్పాటు చేసిన బిజెపి మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో తొమ్మిదిన్నర వేల కోట్ల నిధులతో రామగుండం ఎరువుల కర్మాగారం, ఇంకా జాతీయ రహదారులు ఇతర అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి దేశ ప్రధాని మోడీ వస్తుంటే టిఆర్ఎస్ ఇంకా వామపక్ష పార్టీలు మోడీని అడ్డుకుంటామని పిలుపునివ్వడం దురదృష్టకరమన్నారు.

భారత ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలకడం కనీస సంస్కృతి అని దీనిని పక్కనపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధానిని అడ్డుకుంటామని చెబుతుండడం శోచనీయమన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభిస్తే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని రైతులకు కనీసం మద్దతు ధరకే ఎరువులు లభిస్తాయని అన్నారు. ఈ మధ్య కెసిఆర్ కు వామపక్షాలకు మధ్య దోస్తీ కుదిరిందని కెసిఆర్ డైరెక్షన్లోనే మోడీ పర్యటనను అడుక్కునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.

మోడీని అడ్డుకుంటే గ్రామాల్లో కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇతర ప్రజాప్రతినిధులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఓ ప్రణాళిక సిద్ధం అవుతుందని హెచ్చరించారు. రైతుబంధు పేరిట ప్రజాధనాన్ని కెసిఆర్ దోపిడీ చేస్తున్నారని ఉన్నోళ్లకే రైతుబంధు ఇస్తున్నాడని విమర్శించారు.

బిజెపి వస్తే రైతుబంధు పై స్లాబ్ విధిస్తుందని నిజమైన పేద రైతు వ్యవసాయానికి సాయం చేస్తామని స్పష్టం చేశారు. లిక్కర్ స్కాం లో టిఆర్ఎస్ ఇరుక్కోవడం ఖాయమన్నారు. ఎవరేన్నీ కుట్రలు చేసిన బిజెపి ఎదుర్కొంటుందని అన్నారు. నియోజకవర్గ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎరువుల పరిశ్రమ ప్రారంభం అయితే 20 లక్షల మెట్రిట్లనుల ఎరువులు అందుతాయని ఈ కర్మగారాన్ని 6,300 కోట్లతో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

మోడీ ప్రభుత్వం వచ్చాక ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి ఇల్లు ఇచ్చామని సీఎం కేసీఆర్ మాత్రం ఒక్క డబల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదంటూ విమర్శించారు. టిఆర్ఎస్ హయాంలో జరుగుతున్న అన్యాయ అక్రమాలను బిజెపి ఎదురిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లా మంత్రులను నిలదీస్తామని హెచ్చరించారు.

మోడీ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలను మధ్యాహ్నం మూడు గంటలకు రైతులకు భారీ స్క్రీన్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు అందే బాబయ్య, దేపల్లి అశోక్ గౌడ్, కక్కునూరు వెంకటేష్ గుప్తా, శివారెడ్డి, సున్నాల అంజయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page