ప్రభుత్వ విప్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.. భారీఎత్తున బైక్ ర్యాలీ

Spread the love

ప్రభుత్వ విప్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.. భారీఎత్తున బైక్ ర్యాలీతో బయలుదేరి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి భారీ ఎత్తున బయలుదేరిన బైక్ ర్యాలీని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జండా ఊపి ప్రారంభించారు.

శేరిలింగంపల్లి డివిజన్ లోగల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీగా బయలుదేరి శ్రీరాంనగర్ కాలనీలోని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకొని ప్రభుత్వ విప్ గా ఎన్నికైనందుకు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రభుత్వ విప్ గా ప్రమాణస్వీకారం చేయుచున్న కౌశిక్ రెడ్డి తోపాటు అసెంబ్లీ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ కొనసాగినది. అనంతరం ప్రమాణస్వీకార కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి తో పాటు మంత్రి మల్లారెడ్డి, మహమ్మద్ అలీ, కడియం శ్రీహరి తో పాటు రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ , రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్ మాట్లాడుతూ భవిష్యత్తులో కౌశిక్ రెడ్డి అత్యున్నతమైన పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాగం అభిషేక్ యాదవ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, రవి యాదవ్, గోపాల్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, బస్వరాజ్, వెంకటేశ్వర్ రావు, నయీమ్, సత్యనారాయణ, సుధాకర్, నర్సింహా, వెంకటరెడ్డి, సత్తర్, సాయి, మహమ్మద్ అజీమ్, సుభాష్ రాథోడ్, గఫర్, పులి సాయి, యాదగిరి, దివాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజ్ కుమార్, రవీందర్, విజయ్, జమ్మయ్య, అలీం, రాజు, శ్రీకాంత్, రాజు నాయక్, ఆఫ్జల్, విజయ్ సింగ్, హరి, విష్ణుమూర్తి, నర్సింహ, సాయి, జై, హరీష్, కృష్ణ, మహిళా నాయకురాలు నీరూప, సౌజన్య, జయ, సుధారాణి, రజిని, కళ్యాణి, నజియా, కుమారి, జయమ్మ, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ యూత్ విభాగం నాయకులు, బీఆర్ఎస్ శ్రేయోభిలాషులు, అత్యధిక సంఖ్యలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page